నర్సింగ్ విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపొద్దు
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:08 AM
దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలు, స్కూళ్లలో అమలవుతున్న బాండ్ విధానంపై ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్(ఐఎన్‌సీ) తీవ్రంగా స్పందించింది.
బలవంతంగా సర్వీస్ బాండ్లు రాయించుకుంటే చర్యలు తప్పవు
ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలకు ఐఎన్‌సీ హెచ్చరిక
హైదరాబాద్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలు, స్కూళ్లలో అమలవుతున్న బాండ్ విధానంపై ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్(ఐఎన్‌సీ) తీవ్రంగా స్పందించింది. నర్సింగ్ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థుల నుంచి బలవంతంగా సర్వీస్ బాండ్లు రాయించుకోవడం, వారి సర్టిఫికెట్లను తమ వద్దే అట్టిపెట్టుకోవడంపై ఐఎన్‌సీ మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది. కొన్ని నర్సింగ్ విద్యాసంస్థలు కోర్సు పూర్తయిన విద్యార్థులను తమ అనుబంధ ఆస్పత్రుల్లోనే స్టాఫ్ నర్సులుగా పనిచేయాలని ఒత్తిడి చేస్తూ విద్యార్థుల నుంచి సర్వీస్ బాండ్లను తీసుకుంటున్నాయి. ఆ బాండ్లకు కట్టుబడేలా చేయడానికి విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను తిరిగివ్వకుండా తమ వద్దే ఉంచుకుని వారిని బెదిరిస్తున్నట్లు ఐఎన్‌సీ దృష్టికివచ్చింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల నుంచి సర్వీస్ బాండ్లు తీసుకోవడం, బలవంతంగా ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆపడం అనైతిక చర్యని కౌన్సిల్ స్పష్టం చేసింది. ఇకపై ఏ నర్సింగ్ కాలేజీ అయినా ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే ఐఎన్‌సీ చట్టం ప్రకారం సదరు సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఐఎన్‌సీ సెక్రటరీ కల్నల్ డాక్టర్ సర్వజీత్ కౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని అన్ని యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లు, ేస్టట్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ర్టార్లకు పంపారు.
మెడ్ర్టానిక్, ఏఎ్‌సఐ తెలంగాణ మధ్య ఒప్పందం
ఆధునిక ఓపెన్, లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స పద్ధతులపై పీజీ విద్యార్థులు, యువ శస్త్రచికిత్స నిపుణులకు శిక్షణ అందించేందుకు మెడ్ర్టానిక్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా(ఏఎ్‌సఐ) తెలంగాణ రాష్ట్ర శాఖలు చేతులు కలిపాయి. ఈమేరకు ఇరుపక్షాలు అవగాహన ఒప్పందంపై మంగళవారం సంతకాలు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా వైద్య సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉన్న మెడ్ర్టానిక్ సంస్థ, ఏఎ్‌సఐ తెలంగాణతో కలిసి రెసిడెంట్లు, పీజీ విద్యార్థులు, జూనియర్ శస్త్రచికిత్స నిపుణులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనుంది. మినిమల్లి ఇన్వేసివ్ శస్త్రచికిత్సలపై ప్రత్యేక దృష్టిసారించి, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా ఈ శిక్షణ ఇవ్వనున్నారు.