అందని ఆయుష్ సేవలు..
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:37 PM
అల్లోపతి వై ద్యానికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏవైయూఎస్‌హెచ్(ఆయుర్వేద, యోగా నేచురోపతి, యునాని, సిద్ద, హోమియోపతి) కేంద్రాలు జి ల్లాలో నిర్జీవంగా మారుతున్నాయి. ఆయుష్ ఆసుపత్రులపై సరియైున పట్టింపులు లేక రోగులకు అక్కడ వైద్యం అందని ద్రాక్షలా మారింది. సిబ్బంది కొరత కా రణంగా ఆయుష్ కేంద్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వ డంలేదు.
అరకొర సిబ్బందితో రోగులకు ఇక్కట్లు
-డిస్పెన్సరీలకు సొంత భవనాలు కరువు
-పీహెచ్‌సీల్లోనే కార్యకలాపాలు
మంచిర్యాల, జూన్ 12 (ఆంరఽధజ్యోతి): అల్లోపతి వై ద్యానికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏవైయూఎస్‌హెచ్(ఆయుర్వేద, యోగా నేచురోపతి, యునాని, సిద్ద, హోమియోపతి) కేంద్రాలు జి ల్లాలో నిర్జీవంగా మారుతున్నాయి. ఆయుష్ ఆసుపత్రులపై సరియైున పట్టింపులు లేక రోగులకు అక్కడ వైద్యం అందని ద్రాక్షలా మారింది. సిబ్బంది కొరత కా రణంగా ఆయుష్ కేంద్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వ డంలేదు. 1995లో అప్పటి భారత ప్రభుత్వం ఐఎస్ ఎంహెచ్(ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ హో మియోపతి) విభాగాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం 2003 నవంబర్‌లో ఆయుష్‌గా నామకరణం చేశారు. అల్లోపతి మందులకు ప్రత్యామ్నాయంగా సహజసిద్ద తైలాలు, పొడులతో రోగులకు వైద్యం అందించడం ఆ యుష్ ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో యోగా అ బ్యాసనం కూడా ఉండటంతో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ ప్ర త్యేక శ్రద్ధతో 2014 నవంబర్ 9న ఆయుష్‌ను మరింతగా పటిష్టం చేసేందుకు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు. ఆయుష్ విభాగంలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ఇతర వైద్యశాలలతో సంబంధం లే కుండా ప్రత్యేకంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీలో ఆయుష్ కేంద్రాలు పని చేయాల్సి ఉండగా, సరియైన మౌళిక వసతులు లేక ఆయుష్ కార్యకలాపాలు అంతంత మాత్రమే కొన సాగుతున్నాయి. ఆయుష్ కేంద్రాల్లో దీర్ఘకాలిక రోగా లైన మోకాళ్ల నొప్పులు, చర్య వ్యా ధులు, రక్తపోటు (బీపీ), షుగర్, అసిడిటీ, పైల్స్, శ్వసకోశ రుగ్మతలు, స్త్రీ సంబంధిత వ్యాధులకు చికిత్స అందిస్తారు.
సొంత భవనాలు కరువు...
జిల్లాలో ఆయుష్‌కు సంబంధించి మొత్తం 22 డి స్పెన్సరీలు ఉన్నాయి. అందులో ఆయుర్వేద 13, యు నాని 5, హోమియోపతి 3, నాచురోపతి(యోగా) 1 డిస్పెన్సరీ ఉంది. వీటితోపాటు ఎన్‌ఆర్‌హెచ్‌ఎం(నేషనల్ రూరల్ హెల్త్ మిషన్), ఆసుపత్రుల్లో రోగులకు వైద్య సేవలందుతున్నాయి. చెన్నూరులోని యూనాని విభాగానికి సొంత భవనం మినహాయించి, ఇతర ఎ క్కడ కూడా డిస్పెన్సరీలకు సొంత భవనాలు లేవు. దీంతో ఆయా డిస్పెన్సరీలన్నీ ఆ ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కొనసాగుతున్నాయి. నస్పూర్ ఆయుష్ కేంద్రానికి సొంత స్థలం ఉన్నా అందులో భవన నిర్మాణానికి దశాబ్దాలుగా మోక్షం లభించడంలేదు. స్థానిక పీహెచ్‌సీ సమీపంలో ఆయుష్ కేంద్రం కోసం నాలుగు గుంటల స్థలాన్ని కేటాయించారు. సొం త భవనం లేని కారణంగా ఆయుష్ కేంద్రాన్ని పీహె చ్‌సీలోనే నిర్వహిస్తున్నారు. జిల్లాలోని నస్పూర్, జన్నా రం, తపాల్‌పూర్, నీల్వాయి, మందమర్రి, దేవాపూర్, తాండూర్, కోటపల్లి, బెల్లంపల్లి, కుందారం, లక్షెట్టిపేట, తాళ్లపేట, కన్నెపెల్లిలో ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీలు ఉన్నాయి. యునాని వైద్యానికి సంబంధించి చె న్నూర్, నెన్నెల, బెల్లంపల్లి, దండేపల్లి, లక్షెట్టిపేట మం డలం వెంకట్రావ్‌పేటలో డిస్పెన్సరీలు ఉన్నాయి. అలా గే హోమియో వైద్యానికి సంబంధించి చెన్నూరు మం డలం అంగరాజుపల్లి, కాసిపేట, హాజీపూర్‌లో, నాచు రోపతి విభాగానికి సంబంధించి జైపూర్ మండలం కుందారంలో ఒక డిస్పెన్సరీ ఉంది. కానీ వీటిలో చె న్నూరులో యునాని విభాగానికి మినహా మరెక్కడా సొంత భవనాలు లేవు. వేమనపల్లి మండలం నీల్వా యిలో వెటర్నరీ ఆసుపత్రిలోనే ఆయుర్వేద డిస్పెన్సరీ కొనసాగుతోంది. పశువుల పక్కనే రోగులకు చికిత్స అందించాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
అరకొర సిబ్బందితో ఇబ్బందులు....
ఆయుర్వేద డిస్పెన్సరీల్లో వైద్యుడు, ఫార్మాసిస్టు, అ టెండర్ తప్పనిసరిగా విధులు నిర్వహించాల్సి ఉం టుంది. అయితే జిల్లాలోని చాలా డిస్పెన్సరీల్లో పోస్టు లు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రోగులకు సరియైున వైద్యం లభించడంలేదు. చెన్నూరులో యూనా నికి వైద్యుడు లేడు. అలాగే తపాల్‌పూర్, తాళ్లపల్లి, దండేపల్లి డిస్పెన్సరీల్లో సైతం వైద్యుల పోస్టులు ఖా ళీగా ఉన్నాయి. నస్పూర్ డిస్పెన్సరీలో స్వీపర్ పోస్టు ఖాళీగా ఉంది. వైద్యులు లేని చోట కాంపౌండర్లే రోగు లకు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా యోగా, నేచురోపతికి సంబంధించి జిల్లాలో కేవలం జైపూర్ మండలంలోనే డిస్పెన్సరీ ఉండగా, ఆయా విభాగాల పై ప్రజలకు ఎప్పటికప్పుడు క్యాంపులు నిర్వహిస్తూ అవగాహన కల్పించాల్సి ఉంది. ఆ దిశగా కార్యాచరణ చేపట్టకపోవడంతో క్యాంపులు మరుగునపడి ఆయు ష్‌కు ప్రజలు దూరంగా ఉండవలసిన పరిస్థితులు నెలకొన్నాయి.
సిబ్బందిని కేటాయించాలి...డా. పద్మజ, ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్, జిల్లా ఇన్‌చార్జి
డిస్పెన్సరీలకు సొంత భవనాలులేని కారణంగా పూర్తిస్థాయిలో వైద్య చికిత్సలు అందడం కష్టతరంగా మారింది. సొంత భవనాలతోపాటు సరిపడా వైద్య సి బ్బంది సైతం అందుబాటులో లేరు. వైద్యులు లేని చో ట ఇతర సిబ్బంది చికిత్స అందించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాల క్రమంలో ఆయుష్ కేంద్రాలపై ప్రజ లకు నమ్మకం ఏర్పడుతోంది. చికిత్స కోసం రోగులు అ ధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. జిల్లాలోని అన్ని ఆ యుష్ డిస్పెన్సరీల్లో ప్రస్తుతం సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయి.