kumaram bheem asifabad-‘పుస్తక లోకం’లో.. సమస్యల చీకట్లు
ABN , Publish Date - Nov 11 , 2026 | 10:38 PM
గ్రంథాల యాల్లో సమస్యలు నెలకొన్నాయి. జిల్లాలోని గ్రంథాల యాల్లో సౌకర్యాల లేమితో నిరుద్యోగ యువత అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మారు మూల ప్రాంతాలతో పాటు కాగజ్‌నగర్ లాంటి పట్టణంలోని గ్రంథాలయాల్లో సౌకర్యాలు కరువ య్యాయి. దీంతో నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు పోటీ పడేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా లోని పలు చోట్ల ఇప్పటికీ లైబ్రరీలకు పక్కా భవనాలు లేవు. కొన్ని చోట్ల ఇంకా కేంద్రాలు శిథిలా వస్థకు చేరుకున్నాయి.
- ఇబ్బందులు పడుతున్న యువత
- పట్టించుకోని అధికారులు
కెరమెరి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): గ్రంథాల యాల్లో సమస్యలు నెలకొన్నాయి. జిల్లాలోని గ్రంథాల యాల్లో సౌకర్యాల లేమితో నిరుద్యోగ యువత అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మారు మూల ప్రాంతాలతో పాటు కాగజ్‌నగర్ లాంటి పట్టణంలోని గ్రంథాలయాల్లో సౌకర్యాలు కరువ య్యాయి. దీంతో నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు పోటీ పడేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా లోని పలు చోట్ల ఇప్పటికీ లైబ్రరీలకు పక్కా భవనాలు లేవు. కొన్ని చోట్ల ఇంకా కేంద్రాలు శిథిలా వస్థకు చేరుకున్నాయి. నూతన మండలాల్లో రీడింగ్ రూంలు ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు. .కెరమెరి మండల కేంద్రంలోని గ్రంథాలయంలో అరకొర వసతులతో నెట్టుకొస్తున్నారు. అద్దెభవనంలో సరిపడా సౌకర్యా లు లేక అవస్థలు తప్పడం లేదు. దీంతో పాటు అవసరమైన పుస్తకాలు సైతం అందుబాటులో లేవని చెబుతున్నారు. విజ్ఙానంతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు గ్రంథాలయం ఎంతో ఉపయోగపడుతుంది. కాగా అధికారుల నిర్లక్ష్యం, పర్యావేక్షణ లోపంతో కెరమెరి గ్రంథాలయ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కొన్నేళ్ల క్రితం పాగ గ్రామ పంచాయతీ భవనంలోనే దీన్ని ఏర్పాటు చేశారు. ఆ భవనం కూడా శిథిలావస్థకు మారడంతో అద్దె భవనంలోకి మళ్లీ మార్చారు. అరకొర వసతులు, పుస్తకాల లేమితో పాటు అధికారులు సమయపాలన పాటించడం లేదని స్థానికులు చెబుతున్నారు.
- ఆరేళ్ల క్రితం
పాత గ్రామ పంచాయతీ భవనం కూల్చి ఆ స్థలం లో ఆరేళ్ల క్రితం ముందస్తు ప్రణాళిక లేకుండా పంచాయతీ నిధులతో ఒక షెడ్డును నిర్మించారు. అప్పటి నుంచి నిరుపయోగంగానే దర్శనమిస్తోంది. దేని కోసం నిర్మించారు, వినియోగం లేకుండా ఖాళీగా ఎందుకు ఉంచారో తెలియదని గ్రామస్తులు వాపోతు న్నారు. గ్రంథాలయానికి కొత్త భవనం నిర్మించటమో లేదా అద్దె భవనంలో కొనసాగుతున్నదని ఈ షెడ్డు లోకి మార్చితే యువతకు ఉపయోగకరంగా ఉంటుం దని భావిస్తున్నారు. ఈ షెడ్డులోకి మార్చితే యువ తకు ఉపయోగకరంగా ఉంటుందని పలువురు చెబు తున్నారు. ప్రస్తుతం నిరుద్యోగులు పోలీసు, రైల్వే వం టి పోటీ పరీక్ష కోసం సన్నద్ధవుతున్నారు. వారికి మెరు గైన సౌకర్యాలు కల్పిస్తే ప్రయోజనం చేకూరనుంది.
వసతులు కల్పించాలి..
- కుటికెలా ఆనంద్, కెరమెరి
గ్రంథాయలంలో వసతులు కల్పించాలి. మండల కేంద్రంలో ఒకటే గ్రంథాలయం ఉంది. ఉన్నతాధి కారులు చొరవ చూపి స్థలం కేటాయించడంతో పాటు భవనం నిర్మించాలి. అలాగే వసతులు కల్పించాలి. ప్రస్తుతం నేను పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ప్రిపే రవుతున్నాను. గ్రంథాలయంలో సౌకర్యాలు లేక ఇబ్బం దికరంగా ఉంది. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తు కాలు అందుబాటులో ఉంచాలి.