Share News

పర్యాటక అభివృద్ధికి జిల్లాలో అపారమైన అవకాశాలు

ABN , Publish Date - Sep 26 , 2026 | 11:32 PM

ప్రకృతి వనరులు, పర్యాటక సమతుల్యత కలగలిపి జిల్లాలో పర్యాటక అభివృద్దికి అపారమైన అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీశాఖాధికారి రాహుల్‌ కిషన్‌ జాదవ్‌తో కలిసి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

పర్యాటక అభివృద్ధికి జిల్లాలో అపారమైన అవకాశాలు
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

జిల్లా కలెక్టరేట్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : ప్రకృతి వనరులు, పర్యాటక సమతుల్యత కలగలిపి జిల్లాలో పర్యాటక అభివృద్దికి అపారమైన అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీశాఖాధికారి రాహుల్‌ కిషన్‌ జాదవ్‌తో కలిసి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. టూరిజం సంబంధిత మేగజైన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో పర్యాటక ప్రాంతాలున్న చోట్ల గురించి విస్తృతంగా ప్రచారం చేసి పర్యాటకుల సంఖ్యను పెంచాలన్నారు. ఇందులో భాగంగానే మేగజైన్‌ను విడుదల చేశామన్నారు. అందులో అన్ని వివరాలు పొందుపర్చినట్లు చెప్పారు. ఎకో, టెంపుల్‌ టూరిజం అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, అధికారులు సహకరిస్తే పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌ కుమార్‌, జిల్లా రెవెన్యూ అధికారి మోతీరాం, మంచిర్యాల ఆర్‌డీవో శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2026 | 11:33 PM