బాధితులకు సత్వర సాయం అందించాలి
ABN , Publish Date - Oct 14 , 2026 | 12:31 AM
జిల్లాలో శాంతిభద్ర తల పరిరక్షణతో పాటు పోలీస్ స్టేషన్లకు పనితీరును మరింత మెరుగు పరిచే దిశగా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తనిఖీ చేశారు. కేసుల పరోగతి, పెండింగ్ దర్యాప్తులు, స్టేషన్ రికార్డులు, సిబ్బంది హాజరు, రౌడిషీటర్లు, నేరస్తు లపై నిఘా అంశాలను సమీక్షించి, ప్రజలకు అందిస్తున్న సేవలపై ఎస్పీ ఆరా
ముస్తాబాద్, (గంభీరావుపేట): జిల్లాలో శాంతిభద్ర తల పరిరక్షణతో పాటు పోలీస్ స్టేషన్లకు పనితీరును మరింత మెరుగు పరిచే దిశగా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తనిఖీ చేశారు. కేసుల పరోగతి, పెండింగ్ దర్యాప్తులు, స్టేషన్ రికార్డులు, సిబ్బంది హాజరు, రౌడిషీటర్లు, నేరస్తు లపై నిఘా అంశాలను సమీక్షించి, ప్రజలకు అందిస్తున్న సేవలపై ఎస్పీ ఆరా తీశారు. అనంతం ఎస్పీ మాట్లాడు తూ వివిధ సమస్యలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధి తులకు సత్వర న్యాయం అందేలా బాధ్యతలగా మెల గాలని సూచించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌లో వర్టికల్స్ వారీగా విధులు నిర్వర్తించే సిబ్బంది ని ఒక్కొక్కరిగా వారి పనితీరు గురించి పరిశీలించారు. అధునిక సాంకేతిక వ్యవస్థపై అధికారులు సిబ్బది అవ గాహన కలిగి ఉండాలని స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చాలన్నారు. సమాచారం అందిన వెంటనే పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ సిబ్బంది స్పందించి ఘటన స్థలానికి చేరుకోవా లన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వర్‌రావు, ఎస్‌ఐ జ్యోతి, సిబ్బంది ఉన్నారు.