Indian Medical Association: ఐఎంఏ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - Jan 12 , 2026 | 05:02 AM
ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్ స్వీతి అనూప్ బాధ్యతలు స్వీకరించారు.
సుభాష్ నగర్ కరీంనగర్, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్ స్వీతి అనూప్ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం కరీంనగర్‌లోని ఐఎంఏ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె నూతన కార్యవర్గంతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. కో చైర్‌పర్సన్లుగా పి. శోభరాణి, సంధ్యారాణి, కన్వీనర్‌గా ఝాన్సీ, అడ్వయిజర్‌గా శ్రీలత, సభ్యురాలిగా కీర్తన యాదవ్‌లతో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కిషన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిషన్ మాట్లాడుతూ.. వైద్యరంగంలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు.