’ఇందిరమ్మ’ పేరుతో....ఇసుక అక్రమ నిల్వ..!
ABN , Publish Date - May 22 , 2026 | 12:39 AM
మంచిర్యాలలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. ’ఇందిరమ్మ’ ఇళ్ల పేరుతో ఆన్‌లైన్ బుకింగ్‌లు చేస్తూ రహస్య ప్రాంతాల్లో అక్రమంగా పెద్ద పెద్ద రాశులుగా నిల్వ చేస్తున్నా అడి గేవారు కరువయ్యారు.
-ఇళ్ల నిర్మాణం పేరుతో ఇసుక బుకింగ్
-నిత్యం వందలాది ట్రాక్టర్లతో తరలింపు
-రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తున్న అక్రమార్కులు
-అదును చూసి అధిక ధరలకు విక్రయం
మంచిర్యాల, మే 21 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాలలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. ’ఇందిరమ్మ’ ఇళ్ల పేరుతో ఆన్‌లైన్ బుకింగ్‌లు చేస్తూ రహస్య ప్రాంతాల్లో అక్రమంగా పెద్ద పెద్ద రాశులుగా నిల్వ చేస్తున్నా అడి గేవారు కరువయ్యారు. వందలాది ట్రాక్టర్లు దారి మళ్లు తున్నా సంబంధిత అధికారుల దృష్టికి రాకపోవడం శో చనీయం. ఫిర్యాదులు వచ్చిన సందర్భంలో తప్పా మిగిలిన సమయాల్లో అధికారులు ఇసుక అక్రమ రవాణా పై దృష్టి సారించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇల్లు లేని ని రుపేదలకు ’ఇందిరమ్మ’ పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తోంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను లబ్దిదారునికి ఒక్కో ట్రిప్పుకు రూ. 1050 (మంచిర్యాల నగరంలో) చొప్పున ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించాల్సి ఉం టుంది. అలా ఒక్కో లబ్దిదారుకు మొత్తంగా 11 ట్రిప్పు లు మంజూరు చేస్తారు. అయితే కొందరు ట్రాక్టర్ల య జమానులు లబ్దిదారుల పేరిట అదనంగా ట్రిప్పులు బు క్ చేస్తూ ఇసుకను రహస్య ప్రాంతాల్లో నిల్వ చేశారు.
ఇసుక రీచ్ నుంచే అక్రమ రవాణా....
వినియోగదారుల సౌకర్యార్థం ప్రభుత్వపరంగా ఇసు క రీచ్‌ను జిల్లా కేంధ్రంలోని ముల్కల్ల గోదావరిలో ఏ ర్పాటు చేశారు. వినియోగదారులు అవసరం ఉన్న ఇ సుకను ఇందిరమ్మ ఇల్లయినా, సొంతంగా నిర్మించే భ వనం అయినా ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన రీచ్ నుంచే అధికారికంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదికూ డా ముందస్తుగా నిర్ణీత రుసుం చెల్లించి ఆన్‌లైన్‌లో బు క్ చేసుకుంటే సదరు వినియోగదారునికి అవసరమైన ఇసుక అందుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పేరిట కొందరు ట్రాక్టర్ల యజమానులు ఇసుక రీచ్‌ల వద్ద ఉండే సిబ్బం దిని మశ్చిక చేసుకోవడం ద్వారా నిర్ణయించిన సంఖ్య కంటే అధిక ట్రిప్పులు చేరవేస్తూ రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసినట్లు తెలుస్తోంది. అలాగే సొంతంగా నిర్మించే ఇళ్ల పేరిట సైతం అధిక బుకింగ్‌లు చేస్తూ ఇసుకను రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. సొం తంగా ఇసుకను బుక్ చేసుకునేందుకు మంచిర్యాల నగ రం పరిధిలో ఒక్కో ట్రిప్పునకు రూ. 1800 వరకు ఆన్ లైన్‌లో రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అలా ఇసుక అ వసరం లేకపోయినా కొందరి పేరిట అక్రమంగా బుక్ చేస్తున్నట్లు సమాచారం. అలా ముల్కల్ల రీచ్ నుంచి నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక రహస్య ప్రాంతాలకు తరలిపోతోంది.
వందల సంఖ్యలో ఇసుక రాశులు....
ముల్కల్ల వద్ద గోదావరిలో ఏర్పాటు చేసిన రీచ్ నుంచి అక్రమంగా తరలిపోతున్న ఇసుకను ట్రాక్టర్ యజమానులు రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. ముఖ్యంగా పాత మంచిర్యాల, వేంపల్లి, రంగంపేట శి వారు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా వందల సంఖ్యలో అక్రమ ఇసుక నిల్వలు దర్శనమిస్తున్నాయి. ఒక్కో రాశి లో వందల ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా నిల్వ చేయ డం గమనార్హం. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లో పం కారణంగానే ఇసుక అక్రమ రవాణా యథేశ్చగా జరుగుతుండగా, అడ్డగోలు తవ్వకాలతో గోదావరి గుల్లగా మారుతోంది.
అదును చూసి అధిక ధరలకు విక్రయం....
అక్రమంగా వివిధ ప్రాంతాల్లో నిల్వ చేసిన ఇసుకను సంబంధీకులు అదును చూసి అధిక ధరలకు విక్రయి స్తూ సొమ్ము చేసుకుంటారు. వర్షాకాలంలో గోదావరిలో నీరు చేరి ఇసుక తవ్వకాలకు ఆటంకం ఏర్పడ్డ సమ యంలో అధికారులు ఆన్‌లైన్ బుకింగ్‌లు నిలిపివేస్తా రు. ఆ సమయంలో వినియోగదారులకు ఇసుక దొరక డం కష్టసాధ్యంగా మారుతుంది. ఈ సమయంలో ఎ క్కువ ధర చెల్లించైనా ఇసుకను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు సిద్దపడుతుంటారు. వారి అవసరా న్ని ఆసరాగా తీసుకుంటున్న ట్రాక్టర్ల యజమానులు తాము అక్రమంగా నిల్వ చేసిన ఇసుక రాశులను అధిక ధరలకు విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటారు. ఆన్‌లైన్‌లో రూ. 1800 ధర ఉన్న ఇసుక గోదావరిలో రీచ్ బంద్ అయినప్పుడు ప్రైవేటులో ఒక్కో ట్రిప్పు రూ. 4 వేల వరకు ధర పలుకుతుంది. డిమాండ్‌ను బట్టి రూ. 5వేలకు విక్రయిస్తున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అలా వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. మైనింగ్, రెవెన్యూ అధికారులు ఇసుక అక్రమ నిల్వలపై ధృష్టిసారిస్తే పెద్ద మొత్తంలో లభ్యం అవుతుంది. అట్టి ఇసుకను స్వాధీనం చేసుకొని ఆన్‌లైన్ విధానంలో విక్రయాలు జరిపితే ప్రభుత్వ ఖజానాకు భారీగా సొ మ్ము రావడమేగాక, వినియోగదారునికి ప్రభుత్వం నిర్ణ యించిన ధరలకే ఇసుక లభిస్తుంది. ఈ విషయమై సంబంధిత అఽధికారులు ధృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.