ఐఐటీహెచ్‌లో గ్లోబల్ ఐఎస్ఎస్‌సీ-2027
ABN , Publish Date - Apr 06 , 2026 | 05:21 AM
నిర్మాణ ఇంజనీరింగ్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధకులకు ప్రోత్సాహం అందించేందుకు సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్ గ్లోబల్ వేదికగా నిలువనుంది.
2027 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు సదస్సు
కంది, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): నిర్మాణ ఇంజనీరింగ్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధకులకు ప్రోత్సాహం అందించేందుకు సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్ గ్లోబల్ వేదికగా నిలువనుంది. 2027 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు ఇండియన్ స్ట్రక్చరల్ స్టీల్ కాన్ఫరెన్స్-2027 (ఐఎస్ఎస్‌సీ)ను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పరిశోధన పత్రాల సమర్పణకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 31. ఈ సదస్సుకు లండన్, హాంకాంగ్, సింగపూర్, సిడ్నీ, ఢిల్లీ, పెన్సిల్వేనియాల్లోని ప్రఖ్యాత యూనివర్శిటీల నుంచి ప్రొఫెసర్లు హాజరు కానున్నారు.