Share News

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐఐటీహెచ్‌ దూకుడు

ABN , Publish Date - Mar 26 , 2026 | 05:24 AM

ఐఐటీ హైదరాబాద్‌ అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. క్యూఎస్‌ సంస్థ బుధవారం విడుదల చేసిన వరల్డ్‌ యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌-2026లో రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేస్తూ ప్రపంచ అత్యుత్తమ వర్సిటీ జాబితాలో నిలిచింది.

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐఐటీహెచ్‌ దూకుడు

  • క్యూఎస్‌ వరల్డ్‌ వర్సిటీ ర్యాంకుల్లో సత్తా

కంది, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఐఐటీ హైదరాబాద్‌ అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. క్యూఎస్‌ సంస్థ బుధవారం విడుదల చేసిన వరల్డ్‌ యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌-2026లో రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేస్తూ ప్రపంచ అత్యుత్తమ వర్సిటీ జాబితాలో నిలిచింది. ముఖ్యంగా ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో మొదటిసారి 395వ ర్యాంకును కైవసం చేసుకోవడం విశేషం. గతేడాదితో పోలిస్తే ఏకంగా వందకు పైగా స్థానాలను మెరుగుపర్చుకుంది. ఈ ర్యాంకింగ్స్‌లో ఐఐటీహెచ్‌ కేవలం ఒక విభాగంలోనే కాకుండా, మొత్తం 9 కీలక సబ్జెక్టుల్లో తన పట్టును నిరూపించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరు వేలకు పైగా విద్యాసంస్థలను విశ్లేషించిన క్యూఎస్‌ సంస్థ ఐఐటీహెచ్‌ను అత్యుత్తమ కేంద్రాలలో ఒకటిగా గుర్తించింది. విద్య, పరిశోధన నైపుణ్యాలకు ఐఐటీహెచ్‌ పెద్దపీట వేస్తుందనడానికి ఈ ర్యాంకులే నిదర్శనమని ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎ్‌సమూర్తి హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Mar 26 , 2026 | 05:24 AM