ఐఐటీ-హెచ్‌లోనూ 15 జాబ్ ఆఫర్లు వెనక్కి
ABN , Publish Date - Sep 29 , 2026 | 04:42 AM
ఐఐటీ హైదరాబాద్(ఐఐటీ-హెచ్)లో ఈ ఏడాది నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఒరాకిల్, రాపిడ్యూ టెక్నాలజీస్ సంస్థలు 15మంది విద్యార్థులకు జాబ్ ఆఫర్లు ఇచ్చి, ఆ తర్వాత మొహం చాటేశాయి
హైదరాబాద్, సెప్టెంబరు 28: ఐఐటీ హైదరాబాద్(ఐఐటీ-హెచ్)లో ఈ ఏడాది నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఒరాకిల్, రాపిడ్యూ టెక్నాలజీస్ సంస్థలు 15మంది విద్యార్థులకు జాబ్ ఆఫర్లు ఇచ్చి, ఆ తర్వాత మొహం చాటేశాయి. ఆ జాబ్ ఆఫర్లను అమలు చేయలేదు. విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇందులో ఒరాకిల్ నుంచి 5 ఆఫర్లు, రాపిడ్యూ టెక్నాలజీస్ నుంచి 10 ఆఫర్లు ఉన్నాయి. ఇచ్చిన జాబ్ ఆఫర్లను రద్దు చేసి విద్యార్థులను మోసం చేసినందుకు గాను ఒరాకిల్, రాపిడ్యూ టెక్నాలజీస్ సంస్థలపై ఐఐటీ హైదరాబాద్ రెండేళ్లపాటు క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో పాల్గొనకుండా నిషేధం విధించింది.