Share News

ఐఐటీహెచ్‌లో రెండు కొత్త ఎంటెక్‌ కోర్సులు

ABN , Publish Date - Mar 14 , 2026 | 05:56 AM

కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో రెండు సరికొత్త ఎంటెక్‌ కోర్సులను ఐఐటీ హైదరాబాద్‌ ప్రవేశపెట్టింది. పరిశ్రమల్లో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులను నిపుణులుగా...

ఐఐటీహెచ్‌లో రెండు కొత్త ఎంటెక్‌ కోర్సులు

  • తొలిసారి కెమికల్‌ ఇంజనీరింగ్‌లో ఏఐ, ఎంఎల్‌ కోర్సు

కంది, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో రెండు సరికొత్త ఎంటెక్‌ కోర్సులను ఐఐటీ హైదరాబాద్‌ ప్రవేశపెట్టింది. పరిశ్రమల్లో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులను నిపుణులుగా తిర్చిదిద్దే లక్ష్యంతో ‘ఎంటెక్‌ ఇన్‌ కంప్యూటేషనల్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌’, ‘ఎంటెక్‌ ఇన్‌ ఏఐ/ఎంఎల్‌ ఇన్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌’ కోర్సులను ప్రారంభించినట్లు ఐఐటీహెచ్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో కెమికల్‌ ఇంజనీరింగ్‌ను ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌ (ఎమ్‌ఎల్‌)తో అనుసంధానిస్తూ ఇలాంటి కోర్సులను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి అని సంస్థ పేర్కొంది.

Updated Date - Mar 14 , 2026 | 05:56 AM