ఐఐటీ-హెచ్‌లో కంట్రోల్ సిస్టమ్స్ డిజైన్ కోర్సు
ABN , Publish Date - Jun 02 , 2026 | 05:00 AM
నియంత్రణ వ్యవస్థల (కంట్రోల్ సిస్టమ్స్) రూపకల్పనలో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలనుకునే విద్యార్థులు...
విద్యార్థులు, ఉద్యోగుల కోసం ఆన్‌లైన్ శిక్షణ
కంది, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): నియంత్రణ వ్యవస్థల (కంట్రోల్ సిస్టమ్స్) రూపకల్పనలో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలనుకునే విద్యార్థులు, ఉద్యోగులు, స్వయం ఉపాధి వర్గాల కోసం సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ, హైదరాబాద్ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. తమ ప్రతిష్ఠాత్మక ‘ఓపెన్ టూ ఆల్ టీచింగ్’లో భాగంగా.. మూడు క్రెడిట్లతో కూడిన కంట్రోల్ సిస్టమ్స్ డిజైన్ ఆన్‌లైన్ కోర్సును ప్రారంభిస్తోంది. ఇందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐఐటీహెచ్ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కోర్సు జూలై 27 నుంచి నవంబరు 30 వరకు కొనసాగుతుందని తెలిపారు. బీఎస్సీ, డిప్లొమా, ఇంజినీరింగ్ (బీటెక్) రెండో సంవత్సరం ఆపై తరగతుల విద్యార్థులతో పాటు, సంబంధిత విభాగాల్లో ఎంటెక్, పీహెచ్‌డీ విద్యను అభ్యసిస్తున్న వారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు.