Edward Nathan: ఐఐటీహెచ్ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:48 AM
ఐఐటీ హెచ్(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్)కు చెందిన ఓ విద్యార్థి రూ.2.5 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగ అవకాశం దక్కించుకున్నారు...
కంది, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ఐఐటీ హెచ్(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్)కు చెందిన ఓ విద్యార్థి రూ.2.5 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగ అవకాశం దక్కించుకున్నారు. ఐఐటీహెచ్‌కి చెందిన సీఎ్‌సఈ ఫైనలియర్ విద్యార్థి ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్(21) ఈ ఘనత సాధించారు. 2025 డిసెంబరులో జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ల్లో నెదర్లాండ్‌కు చెందిన ఆప్టివర్ అనే సంస్థ వర్గీ్‌సకు రూ.2.5 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగావకాశం (ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్) ఇచ్చింది. దీంతో ఐఐటీహెచ్ చరిత్రలో క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ల్లో అత్యధిక ప్యాకేజీ సాధించిన విద్యార్థిగా వర్గీస్ నిలిచారు. కాగా, 2025లో ఐఐటీహెచ్ విద్యార్థులు 24 అంతర్జాతీయ జాబ్ ఆఫర్లు సొంతం చేసుకున్నారని, 2024తో పోలిస్తే ప్యాకేజీలు 75 శాతం పెరిగాయని ఐఐటీహెచ్ అధికారులు గురువారం ప్రకటించారు.