Share News

భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు!

ABN , Publish Date - Apr 06 , 2026 | 05:16 AM

భూకంపాలను తట్టుకునేలా 3డీ ప్రింటెడ్‌ కాంక్రీట్‌ గోడల రూపకల్పనపై ఐఐటీ గువాహటి పరిశోధకులు ఓ వినూత్న ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేశారు.

భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు!

  • 3డీ ప్రింటెడ్‌ కాంక్రీట్‌ గోడల విధానాన్ని అభివృద్ధి చేసిన ఐఐటీ గువాహటి పరిశోధకులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5: భూకంపాలను తట్టుకునేలా 3డీ ప్రింటెడ్‌ కాంక్రీట్‌ గోడల రూపకల్పనపై ఐఐటీ గువాహటి పరిశోధకులు ఓ వినూత్న ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేశారు. ప్రత్యేకమైన డక్టైల్‌ కాంక్రీట్‌, మాడ్యులర్‌ స్టీల్‌ ఇన్‌ఫోర్స్‌మెంట్‌తో కూడిన గోడల నిర్మాణ విధానాన్ని రూపొందించారు. అధ్యయన వివరాలు జర్నల్‌ ఆఫ్‌ బిల్డింగ్‌ ఇంజనీరింగ్‌లో ప్రచురితమయ్యాయి. 3డీ ప్రింటెడ్‌ గోడల విధానం ఇతర సాధారణ భవనాల కంటే భూకంప తీవ్రతను తట్టుకోగల సామర్థ్యాన్ని పెంచుతుందని పరిశోధకులు తెలిపారు. ‘ప్రస్తుత భవన నిర్మాణాల నిబంధనలకు అనుగుణంగా 3డీ ప్రింటెడ్‌ గోడలకు స్టీల్‌ రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ జోడించేందుకు ఎలాంటి ప్రాణాణిక విధానాలు లేవు. ఈ లోటును పూడ్చేందుకు.. మేము 3డీ ప్రింటెడ్‌ మెటీరియల్స్‌తో మూడు పూర్తి స్థాయి గోడలను నిర్మించి, భూకంప పరిస్థితుల్లో పరీక్షించి, విజయం సాధించాం’ అని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ బిరాంచీ పాండా పేర్కొన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 05:16 AM