Share News

టీ-హబ్‌లో ఇగ్నైట్‌-2026

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:53 AM

మానవ అవసరాలు, సమస్యలను లోతుగా అర్థం చేసుకుని పరిష్కారాల రూపకల్పనకు దోహదపడే యూజర్‌ రీసెర్చ్‌కు ప్రత్యేకంగా దేశంలోనే తొలిసారి నిర్వహించిన ఇగ్నైట్‌-2026 కాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌లో ఆకట్టుకుంది.

టీ-హబ్‌లో ఇగ్నైట్‌-2026

  • దేశంలోనే తొలి యూజర్‌ రీసెర్చ్‌ కాన్ఫరెన్స్‌హైదరాబాద్‌లో నిర్వహణ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మానవ అవసరాలు, సమస్యలను లోతుగా అర్థం చేసుకుని పరిష్కారాల రూపకల్పనకు దోహదపడే యూజర్‌ రీసెర్చ్‌కు ప్రత్యేకంగా దేశంలోనే తొలిసారి నిర్వహించిన ఇగ్నైట్‌-2026 కాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌లో ఆకట్టుకుంది. నగరంలోని టీ--హబ్‌లో శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శనివారం కూడా నిర్వహిస్తారు. హ్యూమన్‌-సెంట్రిక్‌ డిజైన్‌కు కేంద్రంగా నిలిచిన ఈ సదస్సు ద్వారా డిజైన్‌, టెక్నాలజీ, పాలసీ రంగాల్లో వినూత్న ఆలోచనలకు దారితీసే చర్చలు జరిగాయి. ఉత్పత్తులు, సేవలు, మౌలిక సదుపాయాలు, ప్రజా వ్యవస్థల రూపకల్పనలో యూజర్‌ రీసెర్చ్‌ కీలక పాత్ర పోషిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. ప్రజల అవసరాలు, ప్రవర్తనలను వాస్తవ పరిస్థితుల్లో అధ్యయనం చేయడం ద్వారా ప్రారంభ దశ నుంచే సరైన నిర్ణయాలు తీసుకోవచ్చని, ఇది వ్యాపారం, మార్కెటింగ్‌, విధాన రూపకల్పనకు దిశానిర్దేశం చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమానికి 120 మందికి పైగా పరిశోధకులు, డిజైనర్లు, వ్యవస్థాపకులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు హాజరై పరస్పరం అనుభవాలు పంచుకోవడం, నేర్చుకోవడం ద్వారా సహకారానికి వేదికగా నిలిపారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రాజెక్టులు ఇన్వె్‌స్టమెంట్‌ సెల్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తెలంగాణ రైజింగ్‌--2047 విజన్‌ను వివరించారు. ఇగ్నైట్‌ వంటి కార్యక్రమాలు పరిశ్రమ, సమస్యల పరిష్కారకుల మధ్య అవసరమైన అనుసంధానాన్ని కల్పిస్తున్నాయని కాన్ఫరెన్స్‌ వ్యవస్థాపకురాలు షిప్రా భూటాడా పేర్కొన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 04:54 AM