క్రమశిక్షణతో సాధన చేస్తే క్రీడల్లో రాణిస్తారు
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:22 PM
క్రీడాకారులు క్రమ శిక్షణ, ప ట్టుదలతో నిరంతరం సాధన చేస్తే రా ణిస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని కల్వకుర్తి సీఐ భీమ్‌కుమార్ అన్నారు.
- కల్వకుర్తి సీఐ భీమ్‌కుమార్
కల్వకుర్తి, సెప్టెంబరు 12 (ఆంధ్ర జ్యోతి) : క్రీడాకారులు క్రమ శిక్షణ, ప ట్టుదలతో నిరంతరం సాధన చేస్తే రా ణిస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని కల్వకుర్తి సీఐ భీమ్‌కుమార్ అన్నారు. 12వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ అథ్లె టిక్స్ చాంపియన్‌షిప్స్- 2026కు సం బంధించి శనివారం కల్వకుర్తి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి సెలక్షన్స్‌ను సీఐ భీమ్‌కుమార్ ప్రారంభించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 500మందికి పైగా క్రీడాకా రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.