పట్టాలివ్వకుంటే ఉద్యమం ఉధృతం
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:14 AM
: పేదలు సాగు చేసుకుంటున్న భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలని, లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్
సంస్థాన్‌నారాయణపురం, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): పేదలు సాగు చేసుకుంటున్న భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలని, లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. మండలకేంద్రంలోని సర్వే 225లోని ప్రభుత్వ భూమిని పోలీస్ బెటాలియన్ ఏర్పాటుకు ప్రతిపాదించడతోఓ పార్టీ నాయకులతో కలిసి ఆ భూమిని సోమవారం పరిశీలించారు. భూ ములు సాగు చేసుకుంటున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పేద రైతులు సాగు చేసుకుంటున్న భూమిలో ప్రభుత్వం పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. 150 ఎకరాల భూమిని ఎంతో మంది రైతులు సాగు చేసుకుంటున్నారని, ప్రభుత్వ ప్రతిపాదనతో పేద రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. రైతుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తన ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుంటోజు శ్రీనివాసచారి, మండల కార్యదర్శి దోడ యాదిరెడ్డి, నాయకులు తుమ్మల నర్సిరెడ్డి, పెద్దులు, ముత్యాలు, అంజయ్య, చింతకాయల నర్సింహ, రాచకొండ కృష్ణ, శంకరయ్య, కొమ్ము మల్లేశం పాల్గొన్నారు.