కృష్ణా జలాలు మళ్లించకపోతే ఉద్యమమే
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:16 PM
కొల్లాపూర్ మండలంలోని ప్రసి ద్ధ జిల్దార్ తిప్ప చెరువుకు తక్షణమే కృష్ణా జలాలు మళ్లించి, దాని కింద ఉన్న వేలాది ఎకరాల ఆయకట్టుకు సా గునీరు అందించకపోతే ఉద్యమిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్ హెచ్చరిం చారు.
-జిల్దార్‌తిప్ప చెరువు వద్ద ఆందోళనలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఫయాజ్
కొల్లాపూర్, జూలై 16 (ఆంధ్రజ్యో తి) : కొల్లాపూర్ మండలంలోని ప్రసి ద్ధ జిల్దార్ తిప్ప చెరువుకు తక్షణమే కృష్ణా జలాలు మళ్లించి, దాని కింద ఉన్న వేలాది ఎకరాల ఆయకట్టుకు సా గునీరు అందించకపోతే ఉద్యమిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్ హెచ్చరిం చారు. గురువారం సీపీఐ జిల్లా బృందం జిల్దార్ తిప్ప చెరువును పరిశీలించి, రైతులతో కలిసి అక్కడ ధర్నా నిర్వహించారు. ఫయాజ్ మాట్లా డుతూ 1972వ సంవత్సరంలో రంగదాసు చెరు వుతో పాటు నిర్మించిన జిల్దార్ తిప్ప చెరువుకు నేటికీ రైతులకు పూర్తిస్థాయిలో నీరు అందించ డం లేదని అన్నారు. ఈ ప్రాంతాన్ని ఏలిన పా లకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. మొలచిం తలపల్లి, ముక్కిడిగుండం, గేమ్యనాయక్ తండా, చంద్రబండ తండా తదితర గ్రామాల రైతులకు ఏకైక జీవనాధారమన్నారు. కార్యక్రమంలో సీపీ ఐ మండల కార్యదర్శి తుమ్మల శివుడు, నాయ కులు గుర్రపు కురుమయ్య, ఎండీ యూసుఫ్, జంగం శివుడు, వెంకటస్వామి, శంకర్, అమర గిరి స్వామి, ఎండీ పాషా, పెరుగు వెంకటస్వా మి, శ్రీనివాసులు, చంద్రు, రామకృష్ణ, రాఘ వేంద్ర, రైతులు పాల్గొన్నారు.