Share News

అర్హత కలిగిన ఓటరును గుర్తించాలి

ABN , Publish Date - Jul 09 , 2026 | 11:09 PM

అర్హత క లిగిన ఓటరును గుర్తించేందుకు బీఎల్‌ఏలు పారదర్శకంగా పని చేయాలని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

అర్హత కలిగిన ఓటరును గుర్తించాలి
బీఎల్‌ఏల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి

- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

వెల్దండ, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : అర్హత క లిగిన ఓటరును గుర్తించేందుకు బీఎల్‌ఏలు పారదర్శకంగా పని చేయాలని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఆకృతిగార్డెన్‌లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)పై బీఎల్‌ఏలు, ఇన్‌చార్జీలు, సూపర్‌వైజర్లకు నియోజకవర్గస్థాయిలో నిర్వహించిన కార్యక్రమానికి ఎ మ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు నిరంతం బీఎల్‌ఏలతో సమన్వయం చేసుకుంటూ బూత్‌లలోని ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అర్హత కలిగిన ఓటరు పేరును జాబితాలో తొలగిపోకుండా చూడాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, దానిని పరిరక్షించడం ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో జనార్దన్‌రెడ్డి, తహసీల్దార్‌ కార్తీక్‌కుమార్‌, పీసీసీ ప్రదానకార్యదర్శి రాచమల్ల సిద్దేశ్వర్‌, నియోజకవర్గ కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌గౌడ్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు భూపతిరెడ్డి, డీసీసీ కార్యదర్శి మోతీలాల్‌, మండలకాంగ్రెస్‌ అధ్యక్షులు హరికిషన్‌నాయక్‌, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్‌, బాల్‌రెడ్డి, బృంగి ఆనంద్‌కుమార్‌, భట్టుకిషన్‌రెడ్డి, పర్వత్‌రెడ్డి, వెంకటయ్యగౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు విజయ్‌కుమార్‌రెడ్డి, యాట నర్సింహ, పుల్లయ్య ఉన్నారు.

Updated Date - Jul 09 , 2026 | 11:09 PM