ఏసీబీకి చిక్కిన ఇబ్రహీంపట్నం తహసీల్దార్
ABN , Publish Date - Aug 21 , 2026 | 06:23 AM
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డ్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డి. శ్రీనివాసరెడ్డిపై (తహసీల్దార్ హోదా అధికారి) ఏసీబీ అధికారులు గురువారం కొరడా ఝుళిపించారు.
రూ.6.87 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు
హైదరాబాద్, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డ్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డి. శ్రీనివాసరెడ్డిపై (తహసీల్దార్ హోదా అధికారి) ఏసీబీ అధికారులు గురువారం కొరడా ఝుళిపించారు. శ్రీనివాసరెడ్డితోపాటు కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లల్లో ఆరుచోట్ల సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో రూ.6,87,36,792విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కర్మన్‌ఘాట్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు, స్ధలాలు కొనుగోలు చేయడంతోపాటు మద్యం వ్యాపారంలోనూ పెట్టుబడులు పెట్టినట్లు బయటపడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీనివాసరెడ్డిని అరెస్టు చేసినట్టు ఏసీబీ డీజీ చారుసిన్హా ప్రకటించారు.