Ibomma Ravi Bail Petition Rejected: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ రద్దు
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:29 AM
సినిమా పైరసీ, కాపీ రైట్, ఐటీ యాక్ట్‌తో పాటు మనీ లాండరింగ్ సహా.. మొత్తం ఐదు కేసుల్లో అరెస్టయి జైల్లో ఉన్న ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ రద్దు చేస్తున్నట్లు.....
హైదరాబాద్ సిటీ, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): సినిమా పైరసీ, కాపీ రైట్, ఐటీ యాక్ట్‌తో పాటు మనీ లాండరింగ్ సహా.. మొత్తం ఐదు కేసుల్లో అరెస్టయి జైల్లో ఉన్న ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ రద్దు చేస్తున్నట్లు నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. రవికి బెయిల్ మంజూరు చేస్తే వెంటనే విదేశాలకు పారిపోయే అవకాశముందని, అతడికి విదేశీ పౌరసత్వం ఉందని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది.