‘ఐ బొమ్మ’ మళ్లీ వచ్చింది
ABN , Publish Date - May 14 , 2026 | 04:29 AM
ఐ బొమ్మ మళ్లీ వచ్చింది. కొత్త సినిమాలతో ఐ బొమ్మ పోర్టల్ మళ్లీ ఓపెన్ అవుతోంది. రవి కొత్త డొమైన్లు, మిర్రర్ వెబ్‌సైట్లతో మళ్లీ ఐ బొమ్మ పోర్టల్‌లో సినిమాలు అప్‌లోడ్ చేసి ....
ఓపెన్ అవుతున్న సైట్.. కొత్త సినిమాలన్నీ అందుబాటులో
సినిమాల నిర్మాతలు, పంపిణీదారుల తీవ్ర ఆందోళన
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): ఐ బొమ్మ మళ్లీ వచ్చింది. కొత్త సినిమాలతో ఐ బొమ్మ పోర్టల్ మళ్లీ ఓపెన్ అవుతోంది. రవి కొత్త డొమైన్లు, మిర్రర్ వెబ్‌సైట్లతో మళ్లీ ఐ బొమ్మ పోర్టల్‌లో సినిమాలు అప్‌లోడ్ చేసి ఇంటర్నెట్‌లో అందుబాటులో పెట్టినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. ఐ బొమ్మ నిర్వాహకుడైన ఇమ్మడి రవిని గతేడాది హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మూడునెలల పాటు జైల్లో ఉన్న రవి ఈ ఏడాది ఫిబ్రవరిలో బెయిల్‌పై విడుదలయ్యారు. రవి బయటకు వచ్చిన తర్వాత అతని కదలికలపై పోలీసుల నిఘా కొనసాగుతున్నప్పటికీ ఐ బొమ్మ మళ్లీ అందుబాటులోకి రావడం గమనార్హం. తరచూ మారుతున్న డొమైన్లు, ఎన్‌క్రిప్టెడ్ నెట్‌వర్క్ కారణంగా ఐ బొమ్మను పూర్తిగా అడ్డుకోవడం సవాలుగా మారిందని పోలీసు అధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు గంటల వ్యవధిలోనే ఐ బొమ్మలో లీక్ కావడంతో నిర్మాతలు, పంపిణీదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.