తెలంగాణకే ఐఏఎస్ వాణిప్రసాద్
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:16 AM
ఐఏఎస్ అధికారిణి ఏ.వాణిప్రసాద్ మళ్లీ తెలంగాణ ప్రభుత్వంలోనే బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ మేరకు గతంలో ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించిన ఆమెను...
హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఐఏఎస్ అధికారిణి ఏ.వాణిప్రసాద్ మళ్లీ తెలంగాణ ప్రభుత్వంలోనే బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ మేరకు గతంలో ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించిన ఆమెను తిరిగి తెలంగాణకే కేటాయిస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ (డీవోపీటీ) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ ఐఏఎ్‌సలు కొంతమందిని గతంలో ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేశారు. కాగా తాను తెలంగాణ క్యాడర్ వ్యక్తినేనని, తన చదువు కూడా ఈ రాష్ట్ర పరిధిలోనే పూర్తయిందని, తనను తెలంగాణకే తిరిగి బదిలీ చేయాలంటూ.. ఏపీకి వెళ్లిన సమయంలో వాణిప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆమెను తిరిగి తెలంగాణ క్యాడర్‌కు బదిలీ చేసినట్లు డీఓపీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా వాణిప్రసాద్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో కార్మిక శాఖకు బాధ్యతలు వహిస్తున్నారు.