Share News

అయ్యప్ప ఆలయ నిర్మాణానికి కృషి చేస్తా

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:39 PM

నస్పూర్‌ కాలనీలో అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణంకు శాయశక్తుల కృషి చేస్తానని మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ధరణి మధుకర్‌ అన్నారు. నస్పూర్‌ ప్రెస్‌ క్లబ్‌లో బుధవారం నస్పూర్‌, శ్రీరాంపూర్‌ అయ్యప్ప సేవా సమి తిల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైనా మేయర్‌, పలువురు కార్పో రే టర్లను ఘనంగా సన్మానించి సత్కరించారు.

అయ్యప్ప ఆలయ నిర్మాణానికి కృషి చేస్తా
సన్మాన సభలో మాట్లాడుతున్న మేయర్‌ ధరణి మధుకర్‌

మేయర్‌ ధరణి మధుకర్‌

నస్పూర్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : నస్పూర్‌ కాలనీలో అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణంకు శాయశక్తుల కృషి చేస్తానని మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ధరణి మధుకర్‌ అన్నారు. నస్పూర్‌ ప్రెస్‌ క్లబ్‌లో బుధవారం నస్పూర్‌, శ్రీరాంపూర్‌ అయ్యప్ప సేవా సమి తిల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైనా మేయర్‌, పలువురు కార్పో రే టర్లను ఘనంగా సన్మానించి సత్కరించారు. మేయర్‌ ధరణి మధుకర్‌, కార్పొరేటర్లు రాచకొండ గోపాల్‌ రావు, ఎంబడి కుమార స్వామి, అగల్‌ డ్యూటి రాణి, ఇరుగదిండ్ల రవిందర్‌, మర్రి శ్రీలత, తోట రజిత, బొడ్డు స్వప్నలను శాలువలతో సన్మానించి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నస్పూర్‌ ఏరియా చాలా పెద్ద ప్రాంతం ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించుకోవాల్సిన బా ధ్యత అందరిపై ఉన్నదన్నారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్‌ రావు సహాకారంతో ఆలయ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆధ్యాత్మిక జీవితం మనిషిలో మంచి మార్పుతో పాటు సేవా భావం క్రమ శిక్షణ ఏర్పడు తుందన్నారు. కార్పొరేషన్‌ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా పని చేస్తానన్నారు. ఈ సమావేశంలో నస్పూర్‌ అయ్యప్ప సేవా సమితి గౌరవ అధ్యక్షుడు పేరం రమేష్‌, అధ్యక్షుడు గోలి వజ్రవేలు, శ్రీరాంపూర్‌ కాలనీ అయ్యప్ప సేవా సన్నీధానం అధ్యక్షుడు బొడ్డు లక్ష్మన్‌, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ వంగ శివ, ఉపాధ్యాక్షుడు మర్రి మొగిలి, కార్యదర్శి శ్రీనివాస్‌, సంయుక్త కార్యదర్శి సాంబశివ, కోశాధికారి రాజేందర్‌, భాస్కర్ల రాజేశం తదితరులు పాల్గొన్నారు.

ఫ విహెచ్‌పీఎస్‌ ఆద్వర్యంలో సన్మానం...

వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం మేయర్‌ ధరణి మధుకర్‌ను ఘనంగా సన్మానించారు. నూతనంగా మే యర్‌గా ఎన్నికైన సందర్బంగా ఆయనను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి (బీహె చ్‌పీఎస్‌) జాతీయ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ, జిల్లా కన్వీనర్‌ అప్పారావు, నాయకులు సదానందం, లక్ష్మన్‌, భీమయ్య, సంతోష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 18 , 2026 | 11:39 PM