Share News

సేవకుడిగా పని చేస్తా

ABN , Publish Date - Nov 16 , 2026 | 11:41 PM

ప్రజాపాలనలో రాజకీయ పార్టీలకతీతంగా అ న్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందుతు న్నాయని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రా జేశ్‌రెడ్డి అన్నారు.

సేవకుడిగా పని చేస్తా
పింఛన్‌దారులకు ప్రొసిడింగ్‌ పత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

- పింఛన్‌దారులకు ప్రొసిడింగ్‌ పత్రాల పంపిణీలో ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

తిమ్మాజిపేట, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాలనలో రాజకీయ పార్టీలకతీతంగా అ న్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందుతు న్నాయని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రా జేశ్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఆవంచ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో వివి ధ రకాల చేయూత పింఛన్‌పత్రాలను లబ్ధిదా రులకు సోమవారం ఎమ్మెల్యే అందజేశారు. ఆ యన మాట్లాడుతూ మీకు సేవలందించడానికే రాజకీయాల్లోకి వచ్చానని, సేవకుడిగా పని చే స్తానని అన్నారు. అంతకు ముందు అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించి గ్రామంలో ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదా రుల గృహప్రవేశంలో పాల్గొన్నారు. అనంతరం వెంకాయపల్లిలో నూతన గ్రామపంచాయతీ భ వన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి, హైమాస్ట్‌ విద్యుత్‌ దీపాలను ప్రారంభించా రు. కాంగ్రెస్‌ పార్టీ మం డల అధ్యక్షుడు చిలుక వివేక్‌రెడ్డి, పీసీసీ అధికా ర ప్రతినిధి శ్రీనివాస్‌ బ హుదూర్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్‌, మల్లయ్యగౌడ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ మాధ వులు, సర్పంచ్‌లు చంద్రకళ, భాస్కర్‌గౌడ్‌, రా మాం జనేయులు, తిరుపతిరెడ్డి, రాజు, సురేష్‌, మాజీ సర్పంచ్‌ అజయ్‌ కుమార్‌, నాయకులు ఉస్మాన్‌, లక్ష్మీనారాయణ, లింగం, రామ్మోహన్‌, వెంకటయ్య, రాజు ఉన్నారు.

పల్లెల రూపు రేఖలు మారితేనే...

బిజినేపల్లి, (ఆంధ్రజ్యోతి) : పల్లెలు రూపురేఖ లు మారితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్య మవుతుందని ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు. మండలంలోని మమ్మాయిపల్లి గ్రామంలో నూత నంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని సోమవారం గ్రామ సర్పంచ్‌ ఏటవాలి సరోజన మ్మతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే బిజినేపల్లిలో ఆసరా పింఛన్‌ లబ్ధిదారులకు, గుడ్లనర్వలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీ డింగ్స్‌ అందజేశారు. కార్యక్రమంలో మమ్మాయి పల్లి ఉప సర్పంచ్‌ కదిరె రాము, ఏటవాలి రాజ వర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మిద్దె రాములు, చంద్రగౌడ్‌, సలీం ఉన్నారు.

Updated Date - Nov 16 , 2026 | 11:42 PM