నియోజకవర్గాన్ని విద్య, వైద్యానికి హబ్‌గా మారుస్తా
ABN , Publish Date - Oct 11 , 2026 | 11:31 PM
మంచిర్యాల నియోజకవర్గాన్ని విద్య, వైద్యంకు హబ్‌గా మారుస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే కొ క్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు.
-ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు
మంచిర్యాలక్రైం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల నియోజకవర్గాన్ని విద్య, వైద్యంకు హబ్‌గా మారుస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే కొ క్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. ఆదివారం కాలేజీ రోడ్డులోని పద్మనాయక ఫంక్షన్‌హాలులో ఆర్టీసీ బస్టాండ్, శ్రీ విశ్వనాధ ఆలయ పునర్ నిర్మాణ నమూనాలను పవర్ పాయింట్ ప్రజం టేషన్ ద్వారా పట్టణ ప్రముఖ కోసం ప్రదర్శిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్టీసీ డిపోను పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తామ న్నారు. సుమారు రూ. 30 కోట్లతో అన్ని హంగు లతో బస్టాండ్ నిర్మిస్తామని తెలిపారు ప్రస్తుతం 9 ఫ్లాట్‌ఫారమ్స్ ఉన్నాయని, నవీకరణలో భా గంగా 18 నిర్మించనున్నట్లు తెలిపారు. మిని థియేటర్, షాపింగ్ మాల్ తదితర సౌకర్యాలను ప్రయాణికులకు కల్పించనున్నామన్నారు. అలాగే పురాతన విశ్వనాధ ఆలయంను పునర్నిర్మించ డానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. భక్తుల మనో భావాలకు అనుగుణంగా దేవాదాయ శా ఖ వాస్తు శిల్పి స్థపతి సూచనల మేరకు ఆల యం నిర్మాణం జరుగుతుందన్నారు. అలాగే సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మాఫీ చేయాలన్న తన విన్నపాన్ని ముఖ్యమంత్రి రేం త్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు సానుకూలంగా స్పందించారన్నారు. సింగరేణి మెడికల్ బోర్డును కొత్తగూడెంలో కాకుండా ఏరి యాల వారీగా ఏర్పాటు చేసి అదే రోజు ఫలితా లు విడుదల చేస్తే అవినీతికి ఆస్కారం ఉండ దని తెలిపారు. ఈ కార్యక్రమంలోమాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ దర్ని మధు కర్, డిప్యూటి మేయర్ సల్ల రమ్య, ఆర్టీఏ మెం బర్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొ రేటర్ తూముల నరేష్, మార్కెట్ కమి టీల చైర్మ న్‌లు బానేష్, వెంకటేశ్వర్లు, ఐఎన్‌టీ యూసీ అధ్యక్షుడు తిరుపతి, చాంబర్ ఆఫ్ కామర్స్ గుండ సుధాకర్, నాయకులు రాజు, షాహిద్ ఆలీ, త్రిమూర్తి, నాగభూషణం, శ్రీని వాస్ ,దేవేం దర్‌రెడ్డి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, మహిళ నాయకురాల్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.