మందమర్రిని మెగా మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతా
ABN , Publish Date - Nov 25 , 2026 | 11:34 PM
పా లకవర్గం లేని మందమర్రి మున్సిపాలిటీని మెగా ము న్సిపాలిటీగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామ ని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.
మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి
పలు అభివృద్ధి పనుల ప్రారంభం
మందమర్రి టౌన్, నవంబర్ 25(ఆంధ్రజ్యోతి) : పా లకవర్గం లేని మందమర్రి మున్సిపాలిటీని మెగా ము న్సిపాలిటీగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామ ని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం పట్టణంలోని 22,2,19,3 వార్డులలో దాదాపు 2 కోట్ల అ భివృద్ధి పనులకు ఆయన కలెక్టర్ కుమార్ దీపక్‌తో క లిసి శంఖుస్థాపన చేశారు. విలేకరులతో మాట్లాడు తూ ఇప్పటికే 25 కోట్ల పనులను చేపట్టామని, అభివృద్ధే ల క్ష్యంగా ప్రణాళికలతో పని చేస్తున్నామని తెలిపారు. రో డ్లు, డ్రైనేజీలు పనులు చేపడుతున్నామని, పన్నులు చె ల్లిస్తున్న ప్రజలకు సౌకార్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎప్పటికప్పుడు ప్రజల విన తులను దృష్టిలో పెట్టుకొనే సమస్యలను ఉన్న వార్డుల లో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ పాలనకు, తమ పాలనకు తేడా చూడాలని అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో బడా కాంట్రాక్టర్లకు పనులు అప్ప గించి కమీషన్లు దండుకున్నారన్నారు. కాని తమ పాల నలో ప్రజల మౌలిక సదుపాయాలకే నిధులు కేటా యించి పనులను పూర్తి చేస్తున్నామన్నారు. తాను ప్ర జలకు ఎన్నికలలో ఇచ్చిన హామీను క్రమ క్రమంగా నె రవేరుస్తూ ముందుకు వెళుతున్నానని పేర్కొన్నారు.
వృత్తి శిక్షణ కోర్సులతో ఉపాధి
వృత్తి శిక్షణ నైపుణ్య కోర్సులను నిరుద్యోగులు సద్విని యోగం చేసుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి తె లిపారు. బుధవారం పట్టణంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఆయన సందర్శించారు. ప్రభుత్వ టాంకాం సంస్థ ద్వారా జర్మనీ, జపాన్ తదితర దేశాలలో 14 వే లకు పైగా ఉపాది అవకాశాలు పొందారన్నారు. నియో జకవర్గంలోని మందమర్రిలో స్కిల్ డెవలప్మెంట్ సెంట ర్‌లో చాలా మంది నిరుద్యోగులు భాషా నైపుణ్యం పొం దారన్నారు. విదేశాల్లో ఉద్యోగాలు చేయడం వల్ల నైపు ణ్యం పెరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో మంత్రితో పాటు పాటు కలెక్టర్ ఉన్నారు.