రైతులను ఇబ్బంది పెడితే సహించను
ABN , Publish Date - May 14 , 2026 | 11:32 PM
రైతు శ్రేయస్సే రాష్ట్ర ప్రజా ప్ర భుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్, పర్యా టక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
- జూపల్లి కృష్ణారావు హెచ్చరిక
- కల్వకోల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
పెద్దకొత్తపల్లి, మే 14 (ఆంధ్రజ్యో తి) : రైతు శ్రేయస్సే రాష్ట్ర ప్రజా ప్ర భుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్, పర్యా టక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండల పరిధి లోని కల్వకోల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొను గోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభోత్సవం చేశా రు. మంత్రి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రా లకు తీసు కొస్తే వారిని ఇబ్బందులకు గురి చేసి నట్లు ఫిర్యాదులు వస్తే సహించనని స్పష్టం చేశారు. తాలు పేరుతో తూకాల్లో తరుగు తీస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమం లో మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వన్నోజు సత్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నాగపూర్ విష్ణు, ఉప సర్పంచ్ కుర్మయ్య, కాంగ్రెస్ నాయ కులు గోపాల్‌రావు, మధుయాదవ్, క్రాంతి కుమార్, బిచ్చన్నగౌ డ్, శివగౌడ్, వల్లి, మాజీ వైస్ ఎంపీపీ గువ్వల రాముడు, సాయియాదవ్, రాంబాబు, సీపీఐ నాయకులు, మాజీ సర్పం చ్‌లు తదితరులు పాల్గొన్నారు.