గూడెంగుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా
ABN , Publish Date - Jun 12 , 2026 | 11:38 PM
గూడెంగుట్ట శ్రీసత్యనారాయణస్వామి దేవాలయాన్ని ఆద్మాత్మిక పర్యా టక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్ రావు అన్నారు.
ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
మంచిర్యాలక్రైం, జూన్12 (ఆంధ్రజ్యోతి): గూడెంగుట్ట శ్రీసత్యనారాయణస్వామి దేవాలయాన్ని ఆద్మాత్మిక పర్యా టక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్ రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి హామీ మేరకు 34 రోజుల్లోనే గూడెం సత్యనారాయణ స్వామి అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయనుండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటనను విజ యవంతం చేయాలన్నారు. గూడెం అభివృద్ధి పనులను శంకు స్థాపనకు ఉప ముఖ్యమంత్రి హాజరవుతున్నారని ఆయనతో పాటు పలువురు మంత్రులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం అభివృద్ధి కోసం నిధులు ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, మత్రుల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. శంకుస్థాపన అనం తరం సింగరేణి కార్మికుల కారుణ్య నియామకాలకు సంబంధించి ఉ ద్యోగ నియామక పత్రాలను మంచి ర్యాల కార్పొరేషన్ పరిధిలోని కాలే జీ రోడ్డు పద్మనాయక ఫంక్షన్ హా ల్‌లో డిప్యూటి సీఎం చేతుల మీదు గా అందజేస్తారన్నారు. అనంతరం శ్రీ రాంపూర్ సింగరేణి ఓసీని సంద ర్శించి మంచిర్యాల పట్టణంలో ని వి శ్వనాథ ఆలయ పునర్నిర్మాణ పను లకు శంకుస్థాపన చేస్తారన్నారు. ఆ దివారం పద్మావతి గార్డెన్‌లో జరిగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల స మావేశంలో డిప్యూటి సీఎం పాల్గొం టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అద్య క్షురాలు కొక్కిరాల సురేఖ, మేయర్ ధర్ని మధూకర్, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, నాయకు లు పూదరి తిరుపతి, కార్పొరేటర్లు చింతపండు శ్రీని వాస్, హరిక్రిష్ణ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
గూడెం ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం..
దండేపల్లి: గూడెం ఆలయాన్ని రాష్ట్రంలో ప్రముఖ ఆ ద్మాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే కాం గ్రెస్ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. కాం గ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. శుక్రవారం గూడెంగు ట్ట శ్రీసత్య దేవుడి ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదా వరి పుష్కరాల సందర్బంగా సత్యదేవుడి ఆలయ పున ర్నిర్మాణంతో పాలు పలు అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ. 58 కోట్ల నిఽధలు కేటాయించిందన్నారు.
ఈ నిధులతో ఆలయంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు చేస్తారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన కా ర్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, మేయర్ దర్ని మ ధుకర్, డిసీపీ భాస్కర్, ఏ సీపీ ప్రకాష్, ఆర్జీపీఆర్‌ఎస్ జిల్లా అద్యక్షుడు గడ్డం త్రిమూర్తి, పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శు వెంకటేశ్వర్లు, సతీష్, మాజీ ఎంపీపీలు గురువయ్య, కాంతరావు పాల్గొన్నారు.