kumaram bheem asifabad- న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా
ABN , Publish Date - Oct 27 , 2026 | 10:20 PM
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, క్రమబద్ధీకరణ సాధన కోసం కలెక్టరేట్ ఎదుట నేషనల్ హెల్త్‌మిషన్(ఎన్‌హెచ్‌ఎం)కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక దీక్షలు మంగళవారం నాటికి 15వ రోజుకు చేరుకుంది. దీక్ష శిబిరాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు సందర్శించి మద్దతు తెలిపారు.
ఆసిఫాబాద్‌రూరల్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, క్రమబద్ధీకరణ సాధన కోసం కలెక్టరేట్ ఎదుట నేషనల్ హెల్త్‌మిషన్(ఎన్‌హెచ్‌ఎం)కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక దీక్షలు మంగళవారం నాటికి 15వ రోజుకు చేరుకుంది. దీక్ష శిబిరాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. దేశంలోని 14 రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించినపుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు సంతోష్, నాయకుడు మురళీగౌడ్‌తో పాటు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి
దహెగాం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో యాసంగి సీజన్‌లో రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండలంలోని ఐనంలో మంగళవారం కేత్‌బచావ్ అభియాన్‌లో ఆయన మాట్లాడారు. అధికంగా నీరు అవసరమయ్యే వరి పంటను సాగు చేయవద్దన్నారు. మిర్చి, ఆయిల్ ఫాం సాగుకు 90 శాతం సబ్సిడీపై లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని వివరించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 60 శాతం, బీసీ రైతులకు 40 శాతం రాయితీపై యంత్రాలను పంపిణీ చేయనున్నామని చెప్పారు. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలన్నారు. శనిగ విత్తనాలు వ్యవసాయ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.. అవసరమైన రైతులు ఆధార్ కార్డు, పాస్ పుస్తకాలను సమర్పించి తీసుకెళ్లాలని సూచించారు. పంటలను కాపాడుకోవటానికి నీటిని పొదుపుగా వాడుకోవాలలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వెంకట్, ఏడీఏ మనోహర్, సర్పంచ్ ప్రశాంత్, బీజేపీ నాయకులు ప్రభాకర్ గౌడ్; ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.