Share News

బతికున్నంతకాలం విప్లవోద్యమానికి రుణపడి ఉంటా

ABN , Publish Date - Mar 01 , 2026 | 11:35 PM

విప్లవోద్యమంలో పని చేసినందునే తనకు ఈ రోజు గుర్తింపు వచ్చిందని లేకపోతే సమాజం లో తాను సాధారణ మనిషేని మాత్రమేనని, బతికున్నంతకాలం విప్లవోద్యమానికి రుణపడి ఉంటా నని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, సింగరేణి కార్మిక సమా ఖ్య (సికాస) మాజీ కార్యదర్శి బండి ప్రకాశ్‌ తెలిపారు.

బతికున్నంతకాలం విప్లవోద్యమానికి రుణపడి ఉంటా

మావోయిస్టు మాజీ నేత బండి ప్రకాశ్‌

మందమర్రిటౌన్‌, మార్చి1 (ఆంధ్రజ్యోతి): విప్లవోద్యమంలో పని చేసినందునే తనకు ఈ రోజు గుర్తింపు వచ్చిందని లేకపోతే సమాజం లో తాను సాధారణ మనిషేని మాత్రమేనని, బతికున్నంతకాలం విప్లవోద్యమానికి రుణపడి ఉంటా నని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, సింగరేణి కార్మిక సమా ఖ్య (సికాస) మాజీ కార్యదర్శి బండి ప్రకాశ్‌ తెలిపారు. సమాజంలో దోపిడీ, పీడన, అస మానతలు ఉన్నంతకాలం మావోయిజం, లెని నిజం ఉంటుందన్నారు. మందమర్రిలోని బండి ప్రకాశ్‌మిత్రుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వ హించిన బండి ప్రకాశ్‌ దంపతులు, మాజీ మావోయిస్టు అప్పాచి నారాయణ దంపతుల కు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో బండి ప్రకాశ్‌ మా ట్లాడుతూ ప్రజలే చరిత్ర నిర్మాతలని సమాజాన్ని మార్చే శక్తి వారికి ఉంటుందన్నారు. ప్రస్తుతం విప్లవో ద్యమం అంతం కాలేదని ఆయన తెలిపారు. అనారోగ్యంతో పార్టీకి భారం కాకూడదనే ప్రజా జీవితంలోకి వచ్చానన్నారు. అనంతరం అ ప్పాచి నారాయణ మాట్లాడుతూ ప్రజాప్రభు త్వం ఇచ్చిన అవకాశంతోనే తాము ప్రజాజీ వితంలోకి వచ్చామన్నారు.

అనంతరం ఐఎన్‌టీ యూసీ సెక్రటరీ జనర ల్‌ బి. జనక్‌ప్రసాద్‌, మాజీ మంత్రి బోడ జనార్ధన్‌, మాజీ ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదెలు మాట్లాడారు. వీరి ఊరేగింపులో మాజీ ఎమ్మె ల్యే నల్లాల ఓదెలు డప్పుకొడుతూ నృత్యం చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళ నానికి హెచ్‌ రవీందర్‌ అద్యక్షత వహించగా ఆయన మిత్రు లు మేదరి సత్యనారాయణ, ఓ. రాజశేఖర్‌, వాసాల శంకర్‌, నక్క వెంకట్‌రావు, ఏబూసి యాగయ్య, కార్మికనేత కెంగర్ల మల్లయ్యతో పాటు కాంపెల్లి సమ్మయ్య, గురిజాల రవీందర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2026 | 11:35 PM