Share News

వారసత్వం ద్వారా రాజకీయాల్లోకి రాలేదు

ABN , Publish Date - Mar 10 , 2026 | 10:25 PM

తాను వారసత్వం ద్వారా రా జకీయాల్లోకి రాలేదని, ఉద్యమాల ద్వారానే రాజకీయ నాయకుడిగా ఎది గానని, అక్రమ కేసులకు భయపడ నని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ పేర్కొన్నా రు.

వారసత్వం ద్వారా రాజకీయాల్లోకి రాలేదు

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌

చెన్నూరు, మార్చి 10 (ఆంధ్ర జ్యోతి) : తాను వారసత్వం ద్వారా రా జకీయాల్లోకి రాలేదని, ఉద్యమాల ద్వారానే రాజకీయ నాయకుడిగా ఎది గానని, అక్రమ కేసులకు భయపడ నని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ పేర్కొన్నా రు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్ని కల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి బాల్క సుమన్‌ అంబేద్కర్‌ వి గ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. స మయంలో పోలీసులు కేసు నమోదు చేయగా కేసు విచారణలో భాగంగా మంగళవారం చెన్నూరు మున్సిఫ్‌ మెజిస్ర్టేట్‌ కోర్టుకు ఆయన హా జరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్ర హానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అ నంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ క్యాతనపల్లి మున్సిపాలిటీలో ప్రజ లు తమ ఓటు హక్కును వినియోగించుకుని వా రికి నమ్మకం ఉన్న నాయకులను గెలిపించు కుంటే ప్రజల తీర్పును ఓర్వలేక అక్రమ దారిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు పొందాలని, మంత్రి వివేక్‌ వెంకటస్వామి దాడులు చేయిస్తూ అక్రమ కే సులు బనాయిస్తున్నాడన్నారు. అక్రమంగా కేసులు బనా యించి 16 రోజులు జైలులో పెట్టించి మంత్రి వివే క్‌వెంకటస్వామి రాక్షసానందం పొందుతున్నాడన్నా రు. తాను ఏసీ రూముల్లో పెరిగి మంత్రి వివేక్‌ వెంకటస్వామి లాగా వారసత్వం ద్వారా రాజకీ యాల్లోకి రాలేదని, ఉస్మానియా సాక్షిగా ఉద్యమ పోరాటాల ద్వారానే నాయకునిగా ఎదిగానని ఉ ద్యమ సమయంలో ఎన్నో కేసులను జైలు జీవితా న్ని అనుభవించానని పేర్కొన్నారు.

క్యాతనపల్లి మున్సిపాలిటీలో మంత్రి చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, రాజ్యాంగ బద్దంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే ఓర్వ లేని మంత్రి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూ స్తున్నాడన్నారు. మంత్రి వివేక్‌వెంకట స్వామి ఎన్ని కల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం చెన్నూరు నియోజకవర్గంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి 45 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఇప్పటి వరకు చేయ లేదన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు రూ. 200 కోట్లతో అభివృ ద్ధి పనులు చేశామని, మంత్రికి దమ్ముంటే రూ. 300 కోట్లతో నియోజక వ ర్గాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్‌ చైర్మన్‌ మూల రాజిరెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 10:25 PM