నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నా
ABN , Publish Date - Jul 19 , 2026 | 10:14 PM
చెన్నూరు నియోజకవర్గ సమగ్ర అ భివృద్ధికి కట్టుబడి ఉన్నానని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంక టస్వామి అన్నారు. ఆదివారం చెన్నూ రు పట్టణంలో రూ. 1.40 కోట్లతో ని ర్మించిన నూతన బైపాస్ రోడ్డును ప్రా రంభించారు.
-మంత్రి వివేక్‌వెంకటస్వామి
చెన్నూరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : చెన్నూరు నియోజకవర్గ సమగ్ర అ భివృద్ధికి కట్టుబడి ఉన్నానని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంక టస్వామి అన్నారు. ఆదివారం చెన్నూ రు పట్టణంలో రూ. 1.40 కోట్లతో ని ర్మించిన నూతన బైపాస్ రోడ్డును ప్రా రంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలో సుదీర్ఘకాలం గా ఉన్న ట్రాఫిక్ సమస్యను శాశ్వతం గా పరిష్కరించేలా బైపాస్ రోడ్డు నిర్మా ణం చేశామన్నారు. నూతన బైపాస్ రో డ్డుతో భారీ వాహనాల రాకపోకలు సు లభతరం అవుతాయన్నారు. కేవలం మున్సిపాలిటీ ఎన్నికల కోసమే రోడ్డు ప నులను ప్రారంభించామని ప్రతిపక్షాలు ఆరోపించాయని, అయినా పట్టించుకో కుండా త్వరగా నిర్మాణం పూర్తి చేశా మన్నారు. పట్టణంలో రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించామని, దీన్ని కూ డా త్వరగా పూర్తి చేస్తామన్నారు. 70 మంది షాపులు కోల్పోయిన వారికి కొ త్తగా నిర్మించే వారికి షాపులు ఇస్తా మన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా షాపులు కోల్పోయిన వారికి కూడా షాపులను కేటాయిస్తామన్నారు. చెరువులోని శివాలయాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చే స్తామన్నారు. అలాగే చెన్నూరులోని హా స్టల్‌లో కొన్ని సమస్యలు ఉన్నాయని త న దృష్టికి వచ్చిందని, వెంటనే పరిష్క రించాలని కలెక్టర్ కుమార్ దీపక్ కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. లక్షెట్టిపేట నుంచి ఇక్కడకు వచ్చిన వి ద్యార్థులను కావాలనే ఇక్కడ రాజకీయ చేసి వెళ్లగొట్టారని, విద్యార్థులతో రాజకీ యాలు మానుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. మైనార్టీ హాస్టల్‌లో కూ డా ప్రతిపక్షాల నాయకులు కారం వేసి ఫోటోలు తీసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అనుమతులు లేకుండా హాస్టల్‌లోకి చొరబడి తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. రూ. 40 కోట్లతో చెన్నూరు ప్రజలకు గోదావరి నుంచి తాగునీరు అందిస్తామని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, నాయకులు, అధికా రులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.