Share News

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న హైడ్రా

ABN , Publish Date - Apr 17 , 2026 | 04:03 AM

ప్రభుత్వ, ప్రైవేట్‌, పట్టా భూముల్లో కేసులుంటే ఆ వివాదాలు సివిల్‌ కోర్టు మాత్రమే పరిష్కరిస్తుందని, కానీ హైడ్రా పరిధిని దాటుతోందని హైకోర్టు న్యాయవాది...

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న హైడ్రా

  • ఐలాపూర్‌ భూవివాదంపై న్యాయవాది ముఖీమ్‌ ఆరోపణ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేట్‌, పట్టా భూముల్లో కేసులుంటే ఆ వివాదాలు సివిల్‌ కోర్టు మాత్రమే పరిష్కరిస్తుందని, కానీ హైడ్రా పరిధిని దాటుతోందని హైకోర్టు న్యాయవాది ఎంఏ ముఖీం ఒక ప్రకటనలో ఆరోపించారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని విచ్చలవిడిగా ఇళ్లు, అపార్ట్‌మెంట్లను కూల్చేస్తోందని విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలోని ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు, ఈనెల 15న ‘నిర్మాణ దశలోనే షోకాజ్‌ నోటీసులు’ అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఐలాపురంలోని సర్వేనెం.1 నుంచి 220 దాకా 1263 ఎకరాల్లో యథాతఽథ స్థితిని కొనసాగించాలన్న న్యాయస్థానం తీర్పు ఉందన్నారు. గ్రామస్థులైన లంబాడి పెద్ద బద్రు, ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు తనకు కూడా కలిపి 52 మందికి పట్టాలున్నాయని, అవి తమ అనుభవంలో ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో తన తండ్రి ఎంఏ షరీఫ్‌ పార్టీ కాదని, ఈ భూముల వివాదంతో బసంబంధం లేదని ముఖీం తెలిపారు. హైడ్రా ఆరోపణలన్నీ నిరాధారమన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 04:03 AM