Share News

హైడ్రా పనితీరు భేష్‌.. భేష్‌..!!

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:22 AM

హైదరాబాద్‌ పరిధిలో చెరువులు, కుంటల పునరుద్ధరణకు హైడ్రా చర్యలు బేష్షుగ్గా ఉన్నాయని చెన్నై మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ...

హైడ్రా పనితీరు భేష్‌.. భేష్‌..!!

  • 18 నెలల్లో 1,166 ఎకరాల భూ పరిరక్షణ అసామాన్యం

  • హైడ్రా పనితీరును పరిశీలించిన సీఎండీఏ ప్రతినిధులు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ పరిధిలో చెరువులు, కుంటల పునరుద్ధరణకు హైడ్రా చర్యలు బేష్షుగ్గా ఉన్నాయని చెన్నై మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (సీఎండీఏ) ప్రశంసలు కురిపించింది. ఒక వైపు సముద్రం.. మరో వైపు కిక్కిరిసిన నివాసాలతో కూడిన చెన్నైకి వర్షకాలం వరదలు సర్వ సాధారణమయ్యాయన్నది. ఈ నేపథ్యంలో చెన్నైకీ హైడ్రా వంటి వ్యవస్థ అవసరమని సీఎండీఏ వ్యాఖ్యానించింది. వివిధ శాఖ ల విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి సమన్వయంతో పని చేస్తూ హైడ్రా సత్ఫలితాలు సాధిస్తుందన్నారు. సీఎండీఏ సీఈఓ చంద్రశేఖర్‌ శాఖమూ రి ఆధ్వర్యంలో ఓ ప్రతినిధి బృందం హైడ్రా పనితీరును పరిశీలించేందుకు హైదరాబాద్‌కు వచ్చింది. కేవలం 18 నెలల కాలంలో 1,166 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడటం సామాన్య విషయం కాదని చంద్రశేఖర్‌ శాఖమూరి పేర్కొన్నారు. అమీర్‌పేటలో పూడుకున్న నాలాల పునరుద్ధరణ, సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ నాలా విస్తరణతో నగరంలో వరదల నివారణ తీరును వీడియోలతో సీఎండీఏ అధికారులకు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ వివరించారు.

Updated Date - Apr 08 , 2026 | 05:22 AM