వివాదాస్పద భూముల్లో భారీ భవనాన్ని కూల్చిన హైడ్రా
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:40 AM
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ వివాదాస్పద భూముల్లో నిర్మించిన ఆరంతస్తుల భారీ భవనం కూల్చివేతను హైడ్రా బృందాలు ..
అమీన్‌పూర్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ వివాదాస్పద భూముల్లో నిర్మించిన ఆరంతస్తుల భారీ భవనం కూల్చివేతను హైడ్రా బృందాలు శుక్రవారం నాటికి పూర్తి చేశాయి. గత శనివారం కూల్చివేత పనులను ప్రారంభించిన హైడ్రా బృందాలు శుక్రవారం సాయంత్రానికి భవనాన్ని నేలమట్టం చేశాయి. కూల్చివేత క్రమంలో కొన్ని శకలాలు పెచ్చులూడి పక్క అపార్ట్‌మెంట్‌పై పడటంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. దీంతో హైడ్రా సిబ్బంది నిపుణుల పర్యవేక్షణలో కూల్చివేతల పనులు నిర్వహించారు. పక్క భవనాలకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని అపార్ట్‌మెంట్ వాసులు హైడ్రా సిబ్బంది వద్ద ఆందోళన వ్యక్తం చేయగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని భరోసా కల్పించారు. శుక్రవారం సాయంత్రానికి మొత్తం అంతస్తులు నేలమట్టమయ్యాయి. భారీ శిఽథిలాలను సత్వరమే తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు.