Share News

మహిళా డ్రైవర్ల స్వావలంబనపై దృష్టి

ABN , Publish Date - Feb 05 , 2026 | 04:10 AM

రాష్ట్రంలోని మహిళలను డ్రైవింగ్‌ రంగంలో ప్రోత్సహించడంతోపాటు ఆర్థికంగా వారు స్వావలంబన సాధించే దిశగా మహిళా భద్రతా విభాగం పోలీసులు అడుగులు వేస్తున్నారు.

మహిళా డ్రైవర్ల స్వావలంబనపై దృష్టి

  • వీవీసీ మోటార్స్‌తో మహిళా భద్రతా విభాగం ఒప్పందం

హైదరాబాద్‌, ఫిబ్రవరి4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మహిళలను డ్రైవింగ్‌ రంగంలో ప్రోత్సహించడంతోపాటు ఆర్థికంగా వారు స్వావలంబన సాధించే దిశగా మహిళా భద్రతా విభాగం పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఏడాదిలో 500 మంది మహిళలకు ఎలక్ర్టిక్‌ వాహనాలు నడపడంపై శిక్షణ ఇచ్చి, వారికి సొంతంగా వాహనాలను సమకూర్చనున్నారు. ఈ మేరకు ప్రముఖ వాహన డీలర్ల సంస్ధ వీవీసీ మోటార్స్‌తో రాష్ట్ర మహిళా భద్రతా విభాగం బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మహేంద్ర లాస్ట్‌మైల్‌ మొబిలిటీ అధికారిక భాగస్వామి అయిన వీవీసీ మోటార్స్‌తో కలిసి మహిళా ఆధారిత ఎలక్ర్టిక్‌ మొబిలిటీ పైలట్‌ ప్రాజెక్టును చేపట్టబోతున్నామని అదనపు డీజీపీ చారుసిన్హా తెలిపారు. మహిళా డ్రైవర్ల సమీకరణ, సంస్థాగత సమన్వయ బాధ్యతలను మహిళా భద్రతా విభాగం పర్యవేక్షిస్తుందని, వీవీసీ మోటార్స్‌ సంస్థ వాహనాలను అందిస్తుందని వివరించారు.

Updated Date - Feb 05 , 2026 | 04:20 AM