ఘనంగా శతాధిక వృద్ధురాలి జన్మదినోత్సవం
ABN , Publish Date - Aug 21 , 2026 | 06:32 AM
హైదరాబాద్, విద్యానగర్‌కు చెందిన కిళాంబి అలివేలు 106వ జన్మదిన వేడుకలను ఆమె కుటుంబసభ్యులు గురువారం ఘనంగా నిర్వహించారు.
కిళాంబి అలివేలు 106వ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన కుటుంబసభ్యులు
రాంనగర్, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్, విద్యానగర్‌కు చెందిన కిళాంబి అలివేలు 106వ జన్మదిన వేడుకలను ఆమె కుటుంబసభ్యులు గురువారం ఘనంగా నిర్వహించారు. కిళాంబి అలివేలు 1921 ఆగస్టు 20న జన్మించారు. ఆమె భర్త కిళాంబి కృష్ణమాచార్యులు సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేశారు. అలివేలు, కృష్ణామాచార్యుల దంపతులకు ఐదుగురు కుమారులు. ముగ్గురు కుమార్తెలు సంతానం ఉన్నారు. కృష్ణామాచార్యులు కొంతకాలం క్రితం మరణించగా.. అలివేలు సంరక్షణను కుమార్తెలు, కొడుకులు, కోడళ్లు చూసుకుంటున్నారు. గురువారం ఆమె 106వ జన్మదిన సందర్బంగా కుటుంబ సబ్యులు పాదపూజ చేసి వేదపండితులచే ఆశీర్వచనాలు అందించారు. అమె కూడా పాటపాడి కుటుంబసభ్యులను ఆశీర్వదించారు. 106 ఏళ్ల వయస్సులో ఉన్న అలివేలు.. చేతికర్ర సాయంతో నడుస్తున్నారని, ఆమెకు రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు లేవని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని కుటుంబసభ్యులు తెలిపారు. అంతేకాక, చిన్నతనంలో నేర్చుకున్న పాటలు, పద్యాలను ఇప్పటికీ పాడటమే కాక రామాయణ, భాగవతాలను చెబుతుంటారని వివరించారు.