గ్లోబల్ సీఈవోలను అందిస్తాం
ABN , Publish Date - Jun 24 , 2026 | 03:56 AM
హైదరాబాద్ ఐటీ రంగానికి అమెరికా డెవల్‌పమెంట్ సెంటర్‌లను ఇస్తే.. ప్రపంచాన్ని నడిపించే గ్లోబల్ సీఈవోలను తాము అందిస్తాం’’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క...
అమెరికా ప్రతి తెలుగు ఇంటిలో భాగమైంది
‘ఫ్రీడమ్ 250’ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి):‘‘హైదరాబాద్ ఐటీ రంగానికి అమెరికా డెవల్‌పమెంట్ సెంటర్‌లను ఇస్తే.. ప్రపంచాన్ని నడిపించే గ్లోబల్ సీఈవోలను తాము అందిస్తాం’’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని యూస్ కాన్సులేట్‌లో నిర్వహించిన ‘ఫ్రీడమ్ 250’ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 1990లలో మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్‌లో అడుగుపెట్టడం నుంచి.. సత్య నాదెళ్ల ఆ సంస్థకు సీఈవోగా ఎదగడం వరకు సాగిన ప్రయాణం తెలుగువారి నైపుణ్యానికి నిదర్శనమని భట్టి పేర్కొన్నారు. హైదరాబాద్, అమెరికాకు ఉన్న బంధం దౌత్యపరమైనదే కాదని, అమెరికాలో ఉన్న విద్యార్థులు, ఉద్యోగుల రూపంలో ఆ దేశం ప్రతి తెలుగు ఇంటిలో ఒక భాగమైందని చెప్పారు. అక్కడ వేగంగా విస్తరిస్తున్న భాషగా తెలుగు నిలవడం అందరికీ గర్వకారణమని అన్నారు.