Share News

2 రోజుల్లోనే చోరీ కేసు ఛేదన

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:56 AM

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని హిల్‌రిడ్జ్‌ విల్లాలో జరిగిన భారీ చోరీ కేసును సైబరాబాద్‌ పోలీసులు వేగంగా ఛేదించారు. నిందితుల వద్ద నుంచి సుమారు 8 కిలోల బంగారం...

2 రోజుల్లోనే చోరీ కేసు ఛేదన

  • హైదరాబాద్‌ హిల్‌రిజ్డ్‌ విల్లా్‌సలోని కోట్ల విలువైన సొత్తు రికవరీ..ముగ్గురు నేపాలీ నిందితుల అరెస్టు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని హిల్‌రిడ్జ్‌ విల్లాలో జరిగిన భారీ చోరీ కేసును సైబరాబాద్‌ పోలీసులు వేగంగా ఛేదించారు. నిందితుల వద్ద నుంచి సుమారు 8 కిలోల బంగారం, 1.3 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నేపాల్‌కు చెందిన కమల్‌ షాహి, విమలా షాహి, కల్పనా షాహిలుగా గుర్తించామని.. వీరిని ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేసినట్లు సైబరాబాద్‌ సీపీ ఎం. రమేశ్‌ వెల్లడించారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. జూన్‌ 6న ఇంటి ఓనర్లు బయటకు వెళ్లిన సమయంలో చోరీ జరగగా, జూన్‌ 7న ఇంటికి తిరిగి వచ్చిన వృద్ధ దంపతులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్‌ 8న వారి కుమారుడు వచ్చి లాకర్‌ను పరిశీలించగా.. నగలు మాయమైనట్లు బయటపడింది. లాకర్‌ పక్కనే తాళం చెవి దొరకడంతో సులభంగా తెరిచి నగలు దొంగిలించి, వెంటనే అక్కడి నుంచి పరారైనట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. నిందితుల కదలికలను గుర్తించేందుకు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి.. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు పంపించామని సీపీ రమేశ్‌ తెలిపారు. నేపాల్‌కు చెందిన కరణ్‌ విశ్వకర్మ సహాయంతో సూరజ్‌ అనే ప్రధాన నిందితుడు.. అక్కడి నుంచి వ్యక్తులను హైదరాబాద్‌కు తీసుకువచ్చి, ఇక్కడి విలాసవంతమైన ఇళ్లల్లో సేవకులుగా నియమించేవాడని చెప్పారు. వారి ద్వారా యజమానుల కదలికలు తెలుసుకుని చోరీలకు పాల్పడేవాడ ని గుర్తించామన్నారు.

Updated Date - Jun 12 , 2026 | 05:56 AM