Share News

హైదరాబాద్‌లో బ్రిక్స్‌ సమావేశం

ABN , Publish Date - Jun 21 , 2026 | 05:20 AM

ప్రపంచంలోని ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కూటమి బ్రిక్స్‌కు సంబంధించిన కీలక సమావేశం హైదరాబాద్‌లో జరగనుంది.

 హైదరాబాద్‌లో బ్రిక్స్‌ సమావేశం

  • ఆగస్టు 4, 5 తేదీల్లో నిర్వహణ

ప్రపంచంలోని ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కూటమి బ్రిక్స్‌కు సంబంధించిన కీలక సమావేశం హైదరాబాద్‌లో జరగనుంది. బ్రిక్స్‌ యాంటీ-కరప్షన్‌ వర్కింగ్‌ గ్రూప్‌(ఏసీడబ్ల్యూజీ) రెండో సమావేశాన్ని ఆగస్టు 4, 5 తేదీల్లో నగరంలో నిర్వహించేందుకు కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వశాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. సమావేశ నిర్వహణ కోసం ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల నుంచి టెండర్లు కూడా ఆహ్వానించింది. ఈ సమావేశాల్లో అవినీతి నిరోధం, అక్రమ ఆస్తుల గుర్తింపు, అంతర్జాతీయ సహకారం, పారదర్శక పాలన తదితర అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ సదస్సులకు ఇప్పటికే కేంద్ర బిందువుగా మారిన హైదరాబాద్‌.. బ్రిక్స్‌ సమావేశంతో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. ప్రస్తుతం బ్రిక్స్‌లో బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇరాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఇండోనేషియా, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా ఉన్నాయి.

Updated Date - Jun 21 , 2026 | 05:20 AM