Share News

హైదరాబాద్‌ టూ గోవా.. ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ

ABN , Publish Date - Feb 24 , 2026 | 05:42 AM

వేసవి ప్రారంభంలో ప్రయాణికులకు ఆహ్లాదం, ఆధ్యాత్మికం కలగలుపుతూ తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక గోవా టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.

హైదరాబాద్‌ టూ గోవా.. ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): వేసవి ప్రారంభంలో ప్రయాణికులకు ఆహ్లాదం, ఆధ్యాత్మికం కలగలుపుతూ తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక గోవా టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా ఈనెల 25న హైదరాబాద్‌ నుంచి గోవాకు రాజధాని ఏసీ బస్సును నడుపుతుంది. బస్సు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయం, ఉడిపి, మురుడేశ్వర్‌ మీదుగా గోవా చేరుకుంటుంది. ఆ తర్వాత గోవా నుంచి తిరిగి హైదరాబాద్‌ వస్తుంది. ఒక్కో టిక్కెట్‌ ధర రూ. 5,130గా అధికారులు నిర్ణయించారు. మరింత సమాచారం కోసం ఆర్టీసీ అధికారిక వెబ్‌సైబ్‌, స్థానిక బస్‌ డిపోలో సంప్రదించాలని తెలిపారకల్తీ పాల మృతుల

Updated Date - Feb 24 , 2026 | 05:42 AM