అమెరికాలో స్కై డైవింగ్ ప్రమాదం
ABN , Publish Date - Jul 17 , 2026 | 06:17 AM
అమెరికాలో జరిగిన స్కై డైవింగ్ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గడ్డం మణి చంద్రతేజ (28) మృతి చెందాడు.
హైదరాబాద్ వాసి మృతి
హైదరాబాద్ సిటీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో జరిగిన స్కై డైవింగ్ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గడ్డం మణి చంద్రతేజ (28) మృతి చెందాడు. మసాచుసెట్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కై డైవింగ్‌పై ఆసక్తి ఉన్న మణితేజ గతంలోనూ పలుమార్లు డైవింగ్ చేశాడు. అయితే, ఆదివారం స్కైడైవింగ్ ముగించుకుని పారాచూట్ల సాయంతో కిందకు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి. దీంతో పారాచూట్ నియంత్రణ తప్పి, అతడు 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన మణితేజను సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. విజయవాడకు చెందిన మణితేజ కుటుంబం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది. ఇక్ఫాయ్ ఫౌండేషన్‌లో విద్యను పూర్తిచేసుకున్న తేజ 2022లో మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లాడు. రెండేళ్లుగా బోస్టన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు.