Share News

భార్య సంతకాన్ని ఫోర్జరీ చేసి విడాకులు.. మూడేళ్ల తర్వాత సాప్ట్‌వేర్‌ ఉద్యోగి అరెస్ట్‌

ABN , Publish Date - Jun 18 , 2026 | 06:18 AM

భార్య సంతకాన్ని ఫోర్జరీ చేసి, కోర్టును తప్పుదోవ పట్టించి విడాకులు పొందిన సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను హయత్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

భార్య సంతకాన్ని ఫోర్జరీ చేసి విడాకులు.. మూడేళ్ల తర్వాత సాప్ట్‌వేర్‌ ఉద్యోగి అరెస్ట్‌

హయత్‌నగర్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): భార్య సంతకాన్ని ఫోర్జరీ చేసి, కోర్టును తప్పుదోవ పట్టించి విడాకులు పొందిన సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను హయత్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. హయత్‌నగర్‌కు చెందిన పెండ్యం శరణ్యకు భువనగిరికి చెందిన కైరంకొండ రాజేంద్ర ప్రసాద్‌తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన ఏడాది నుంచే వరకట్నం కోసం వేధింపులు ప్రారంభం కావడంతో శరణ్య పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్‌ భార్యకు తెలియకుండా భువనగిరి కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశాడు. అందులో భార్య అడ్రసు తప్పుగా పేర్కొనడంతో కోర్టు పంపిన 5 నోటీసులు ఆమెకు అందలేదు. శరణ్య నుంచి జవాబు రాకపోవడంతో మే 2022లో కోర్టు విడాకులు మంజూరు చేసింది. అనంతరం నిందితుడు డిసెంబరు 2022లో మరో యువతిని వివాహం చేసుకోగా, వీరికి మూడేళ్ల పాప ఉంది. విషయం తెలుసుకున్న శరణ్య 2023 జూన్‌లో హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో అవి ఫోర్జరీ సంతకాలేనని పోలీసులు గుర్తించారు. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి తల్లిదండ్రులతోపాటు మరో నలుగురు కుటుంబసభ్యులకు నోటీసులు జారీ చేశారు.

Updated Date - Jun 18 , 2026 | 06:18 AM