Share News

సూపర్‌వైజర్‌ ఆస్పత్రిపాలయ్యాడు ‘సర్‌’!

ABN , Publish Date - Jul 10 , 2026 | 05:57 AM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియలో ఎదురైన పని ఒత్తిడిని తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురై ఓ సూపర్‌వైజర్‌ ఆస్పత్రిపాలైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

సూపర్‌వైజర్‌ ఆస్పత్రిపాలయ్యాడు ‘సర్‌’!

  • హైదరాబాద్‌లోని ఓల్డ్‌మలక్‌పేటలో అస్వస్థతకు గురైన అధికారి

చాదర్‌ఘాట్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియలో ఎదురైన పని ఒత్తిడిని తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురై ఓ సూపర్‌వైజర్‌ ఆస్పత్రిపాలైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హైదరాబాద్‌, ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌కు చెందిన సర్‌ సూపర్‌వైజర్‌ సయ్యద్‌ మోహీనుద్దీన్‌ ఈ నెల రెండో తేదీ నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డివిజన్‌లోని పోలింగ్‌ బూత్‌ల వారీగా నియమితులైన బీఎల్‌వోల్లో 10మంది ఎన్యూమరేషన్‌ ఫారాలను సక్రమంగా పంపిణీ చేయలేదు. ఆ భారమంతా సూపర్‌వైజర్‌ మోహీనుద్దీన్‌పై పడింది. పని ఒత్తిడి వల్ల ఆయన బీపీ, షుగర్‌ స్థాయీలు ఒక్కసారిగా పెరిగిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తన పరిస్థితిపై ఈఆర్‌వో, ఏఈఆర్‌వోలకు సమాచారం ఇచ్చేందుకు తన కుమారుడితో కలిసి ఈ నెల 2న కార్యాలయానికి వెళ్లిన మోహీనుద్దీన్‌ అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. మోహీనుద్దీన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Jul 10 , 2026 | 05:57 AM