హైకోర్టు జడ్జిపై కల్పిత వార్తను ప్రసారం చేసిన వ్యక్తి అరెస్టు
ABN , Publish Date - May 19 , 2026 | 05:14 AM
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవిపై కల్పిత వార్తలను సోషల్ మీడియాలో ప్రసారం చేసి, విపరీతమైన ట్రోల్స్ కారణమైన నిందితుడిని ...
నిందితుడు ఓ మీడియా సంస్థ రిపోర్టర్
హైదరాబాద్ సిటీ, మే 18(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవిపై కల్పిత వార్తలను సోషల్ మీడియాలో ప్రసారం చేసి, విపరీతమైన ట్రోల్స్ కారణమైన నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతడు నెల్లూరుకు చెందిన దామోదర్‌గా గుర్తించారు. ఓ మీడియా సంస్థలో రిపోర్టర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు. బాలికపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను రక్షించుకోవడానికి ఆయన తండ్రి బండి సంజయ్ ఎత్తులు వేస్తున్నారని, న్యాయమూర్తి కుటుంబానికి మంచి పదవి కట్టబెడుతామంటూ ఆఫర్ చేశారని ఆరోపిస్తూ ఈనెల 14న కల్పిత వార్తను ప్రసారం చేశాడు. అనంతరం న్యాయమూర్తిపై అనేక ట్రోల్స్ రావడంతో పాటు, ప్రింట్, ఎలకా్ట్రనిక్ మీడియాల్లో పలు వార్తలు వెలువడ్డాయి. దాంతో తప్పుడు వార్తను సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్ బీఎస్ చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని నెల్లూరుకు చెందిన దామోదర్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.