Share News

‘సెహత్‌ సురక్షా’తో రూ.20 లక్షల బీమా అందజేత!

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:44 AM

సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(సీఎంసీ) ఆధ్వర్యంలో అమలవుతున్న ‘సెహత్‌ సురక్షా’ బీమా పథకం కింద దేశంలోనే అత్యధికంగా రూ. 20లక్షల బీమా క్లెయిమ్‌ను అధికారులు విజయవంతంగా పరిష్కరించారు.

‘సెహత్‌ సురక్షా’తో రూ.20 లక్షల బీమా అందజేత!

  • దేశంలోనే తొలిసారిగా రికార్డు స్థాయి క్లెయిమ్‌

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(సీఎంసీ) ఆధ్వర్యంలో అమలవుతున్న ‘సెహత్‌ సురక్షా’ బీమా పథకం కింద దేశంలోనే అత్యధికంగా రూ. 20లక్షల బీమా క్లెయిమ్‌ను అధికారులు విజయవంతంగా పరిష్కరించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వీధి వ్యాపారి, స్వయం సహాయక సంఘం (ఎస్‌హెచ్‌జీ) సభ్యుడు బబ్బూరి రాజు భార్య మాధవికి సీఎంసీ అదనపు కమిషనర్‌ మంగళవారం ఈ బీమా చెక్కును అందించారు. సీఎంసీ, ఇండియన్‌ బ్యాంక్‌, నివా బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సంయుక్త భాగస్వామ్యంతో ఈ పాలసీ అమలవుతోంది. హైదరాబాద్‌లోని ఇండియన్‌ బ్యాంక్‌ మైక్రోస్టేట్‌ బ్రాంచ్‌ ద్వారా స్వయం సహాయక సంఘ రుణం పొందిన సమయంలో బాధితుడు ఈ పాలసీ నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు బీమా రక్షణ ఎంత కీలకమో ఈ క్లెయిమ్‌ నిరూపించిందన్నారు. కుటుంబాలకు ఆపద సమయాల్లో ఇలాంటి బీమా పథకాలు ఆర్థిక భరోసా కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 05:45 AM