Share News

పామాయిల్‌, డాల్డాతో కల్తీ నెయ్యి తయారీ

ABN , Publish Date - Mar 05 , 2026 | 02:03 AM

పామాయిల్‌, డాల్డా, ఆవు పాల మీగడ, గేదె పాల మీగడలను మిక్సింగ్‌ చేసి.. కల్తీ నెయ్యి తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

పామాయిల్‌, డాల్డాతో కల్తీ నెయ్యి తయారీ

  • 530 కిలోల కల్తీ నెయ్యి స్వాధీనం.. నిందితుడి అరెస్టు

హైదరాబాద్‌ సిటీ/బంజారాహిల్స్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): పామాయిల్‌, డాల్డా, ఆవు పాల మీగడ, గేదె పాల మీగడలను మిక్సింగ్‌ చేసి.. కల్తీ నెయ్యి తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12, భోలానగర్‌లో ‘‘ప్రైడ్‌ డెయిరీ’’ పేరుతో మొహమ్మద్‌ జునైద్‌ హుస్సేన్‌(26) నెయ్యి తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. నిందితుడు పామాయిల్‌, ఆవుమీగడ, గేదె మీగడ, డాల్డా కలిపి కల్తీ నెయ్యిని తయారు చేసి బ్రాండెడ్‌ ప్యాకింగ్‌లో మార్కెట్లోకి తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. పోలీసుల దాడిలో 530 కిలలో నెయ్యితోపాటు రూ.18,26,679 విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Mar 05 , 2026 | 02:03 AM