రుచుల రాజధాని.. హైదరాబాద్‌కు అవార్డు
ABN , Publish Date - Jun 16 , 2026 | 05:25 AM
దేశీయ పర్యాటక రంగంలో తెలంగాణ అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. తనదైన ప్రత్యేక వంటకాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్..
నేషనల్ కలినరీ డెస్టినేషన్ అవార్డు కైవసం
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): దేశీయ పర్యాటక రంగంలో తెలంగాణ అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. తనదైన ప్రత్యేక వంటకాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్.. తాజాగా ‘నేషనల్ కలినరీ డెస్టినేషన్’ (జాతీయ పాకశాస్త్ర గమ్యస్థానం) అవార్డును కైవసం చేసుకుంది. గోవాలో సోమవారం జరిగిన ఇండి యా టుడే టూరిజం సదస్సులో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చేతుల మీదు గా రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ... హైదరాబాద్‌కు లభించిన ఈ గౌరవం నగరానికి ఉన్న గొప్ప ఆహార వారసత్వానికి, తెలంగాణ పర్యాటక రంగం సాధిస్తున్న ప్రగతికి ప్రతీక అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ చాయ్, తెలంగాణ సంప్రదాయ వంటకాలు దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని తెలిపారు.