Share News

సర్కారు వారి మెట్రో రైలు.. 31 నుంచే!

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:01 AM

మెట్రో రైలు మరికొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం చేతికి రానుంది. హైదరాబాద్‌ మెట్రో రైలు స్వాధీనానికి సంబంధించిన ప్రక్రియలన్నీ దాదాపు పూర్తయ్యాయి.

సర్కారు వారి మెట్రో రైలు.. 31 నుంచే!

  • యాజమాన్య బదిలీకి పూర్తయిన ఏర్పాట్లు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): మెట్రో రైలు మరికొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం చేతికి రానుంది. హైదరాబాద్‌ మెట్రో రైలు స్వాధీనానికి సంబంధించిన ప్రక్రియలన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 31 నుంచి మెట్రో రైలును నడిపించేందుకు సర్కారు సిద్ధమైంది. నష్టాలతో సతమతమవుతున్నామని, మెట్రో రైలు నిర్వహణ నుంచి తప్పుకొంటామని నాలుగైదేళ్లుగా ఎల్‌అండ్‌టీ సంస్థ చెబుతోంది. ఇదే విషయాన్ని గత సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. సుదీర్ఘ చర్చల తర్వాత ఎల్‌అండ్‌టీ వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.13 వేల కోట్ల రుణంతో పాటు సంస్థ ఈక్విటీ వాటా రూ.2 వేల కోట్లను చెల్లించేందుకు అంగీకరించింది. ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రో రైలును టేకోవర్‌ చేసిన తర్వాత ఎలాంటి మార్పులు లేకుండానే ప్రభుత్వం కార్యకలాపాలను నిర్వహించనుంది.

Updated Date - Mar 24 , 2026 | 05:01 AM